డ్యాన్స్ మాస్టర్, డైరెక్టర్, సపోర్టింగ్ రోల్స్, హీరో ఇలా అని రకాలుగా తన సత్తాను చూపించాడు రాఘవ లారెన్స్. డ్యాన్స్ మాస్టర్ గా కెరీర్ ను ప్రారంభించినప్పటికీ ఆ తరువాత కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ కూడా చేశాడు. అంతేకాదు పలు సినిమాలకు దర్శకత్వంలో కూడా వహించాడు. ముఖ్యంగా హార్రర్ సినిమాలతో లారెన్స్ కు మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఇప్పుడు హీరోగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కతిరేసన్ దర్శకత్వంలో లారెన్స్ హీరోగా వస్తున్న సినిమా రుద్రుడు. ఈసినిమా ఏప్రిల్ 14వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. రీసెంట్ గానే ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయగా అది ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్ లో పాల్గొన్న లారెన్స్ మాట్లాడుతూ.. రుద్రుడు కథని దర్శకుడు కతిరేసన్ చాలా అద్భుతంగా తీశారు. అందులో మదర్ సెంటిమెంట్ నా మనసుని చాలా ఆకట్టుకుంది. నా ప్రతి సినిమాలో ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉండేలా చూసుకుంటాను. అదే సమయంలో మాస్, యాక్షన్ మిస్ కాకుండా చూసుకుంటాను. రుద్రుడులో ఫ్యామిలీ, మాస్, యాక్షన్, డ్యాన్స్ అన్నీ వుంటాయి. ఏప్రిల్ 14న మీ అందరూ థియేటర్ కి వెళ్లి చూడాలి. ఇక్కడికి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను
మా టెక్నికల్ టీం అందరికీ థాంక్స్. మధు గారు నాకు లక్కీ నిర్మాత. ఆయనతో చేసిన అన్ని సినిమాలు హిట్ అయ్యాయి. మధు గారు ఈ సినిమా తీసుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ప్రియా భవానీ శంకర్ చాలా చక్కగా చేసింది. ఒక హీరోగా నేను బావుండాలి అనే కంటే మనిషిగా నేను బావుండాలని, నా సినిమాలన్నీ విజయాలు సాధించాలని మీరు కోరుకోవడం చాలా ఆనందంగా వుంది. ‘స్క్రీన్ మీద కాదు రియల్ లైఫ్ లో హీరోగా వుండాలి’’ అని మా అమ్మ చెబుతూ వుంటుంది. నా వల్ల ఎంత సాయం చేయగలుగుతానో అంత చేస్తాను. ఈ సేవాకార్యక్రమాలు నన్ను పని మనిషిగా పెట్టుకొని దేవుడు చేయిస్తున్నాడని భావిస్తాను. సేవ చేయడానికి నన్ను ఎంపిక చేసుకున్న రాఘవేంద్ర స్వామికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మూడేళ్ళ తర్వాత రుద్రుడుతో వస్తున్నాను. నాపై ఎంతో ప్రేమ చూపిస్తున్న ప్రేక్షకులు,అభిమానులకు కృతజ్ఞతలు. మీలో ఎవరికైనా చదువు, వైద్యం విషయంలో సాయం కావాలనుకుంటే లారెన్స్ చారిటుబుల్ ట్రస్ట్ కి సంప్రదించండి. మీ సేవకుడిగా నేను వున్నాను. నా దగ్గర వున్న డబ్బులన్నీ మీరు ఇచ్చినవే. మీకు సేవ చేయడానికి రెడీగా వున్నాను. మీ అందరినీ కలిసినందుకు చాలా ఆనందంగా వుంది అని అన్నారు.
కాగా ఈసినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈ మూవీ లో శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కదిరేశన్ సమర్పణలో ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నిర్మిస్తున్నారు. రుద్రన్ మూవీ ని తమిళ , తెలుగుతో పాటు మలయాళ , కన్నడ భాషలలో కూడా రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: