ఉస్తాద్ భగత్ సింగ్ సెట్ లో అడుగుపెట్టిన సెన్సేషన్ హీరోయిన్

young beauty sree leela joins in ustad bhagat singh movie shoot

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషలో వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ గబ్బర్ సింగ్ సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా నుండి చాలా కాలం క్రితం టైటిల్ రిలీజ్ అప్ డేట్ రాగా.. రీసెంట్ గానే ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. వాటికే సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈసినిమా తేరీ సినిమాకు రీమేక్ అని మొదటినుండీ అంటున్నారు. అయితే కథలో చాలా మార్పులు చేశాడట హరీష్ శంకర్. నిజానికి గబ్బర్ సింగ్ కూడా దబాంగ్ రీమేక్. కానీ ఆ సినిమాకు గబ్బర్ సింగ్ సినిమాకు చాలా తేడా ఉంటుంది. రెండు వేరు వేరు సినిమాలు అని చెప్పినా నమ్మేలా ఉంటాయి. ఇక ఇప్పుడు ఈ స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేశాడట. పవన్ కళ్యాణ్ కు ఎలాంటి ఎలిమెంట్స్ కావాలో అవి యాడ్ చేస్తూ తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసి తీసుకొస్తున్నట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా షూటింగ్ ను రీసెంట్ గానే మొదులుపెట్టిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం అయితే అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈసినిమా షూటింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉండగా ఈసినిమాలో శ్రీలీల కూడా నటిస్తున్న సంగతి విదితమే కదా. ఈనేపథ్యంలో శ్రీలీల కూడా సెట్ లో జాయింది. ఈవిషయాన్ని చిత్రయూనిట్ తెలియచేస్తూ శ్రీలీల కు వెల్ కమ్ చెప్పారు. ప్రస్తుతం శ్రీలీల తో కొన్నికీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారట.

కాగా ఈసినిమాలో హీరోయిన్ గా పూజాహెగ్డే నటిస్తుంది. ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. ఈసినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన మిగతా నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =