దసరాకు రానున్న సినిమాలు ఇవే …

Dussehra Telugu Movie Releases Update

ఈ దసరాకు ఏకంగా నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయి. వరుసగా నాలుగు రోజులు సెలవులు రానుండడంతో బిగ్ బడ్జెట్ సినిమాలు,దసరా స్లాట్ ను బుక్ చేసుకుంటున్నాయి. అందులో భాగంగా టాలీవుడ్ నుండి మూడు సినిమాలు అలాగే కోలీవుడ్ నుండి ఒకటి విడుదలకానున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమాల విషయానికి వస్తే ఇందులో మొదటి సినిమాగా విడుదలకానుంది తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లియో. విక్రమ్ ఫేమ్ లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తుండడంతో తెలుగులో కూడా ఈ సినిమాఫై భారీ అంచనాలు వున్నాయి. లియో ఇటీవలే కాశ్మీర్ లో మొదటి షెడ్యూల్ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. సంజయ్ దత్ ,అర్జున్ ఇలా స్టార్ క్యాస్టింగ్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. అక్టోబర్ 19న ఈసినిమా విడుదలకానుంది.

ఈ సినిమా తరువాత ఒక్క రోజు గ్యాప్ లో బోయపాటి శ్రీనివాస్ ,రామ్ పోతినేని కాంబినేషన్ లో వస్తున్న సినిమా విడుదలకానుంది. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈచిత్రంలో రామ్ సరసన శ్రీ లీలా, హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈసినిమా, పాన్ ఇండియా మూవీగా అక్టోబర్ 20న విడుదలకానుంది. రామ్ కు ఇదే తొలి పాన్ ఇండియా మూవీ.

ఈసినిమాతోపాటు అదే రోజున మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు కూడా విడుదలకానుంది. గజదొంగ టైగర్ నాగేశ్వర రావు బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో రవితేజ టైటిల్ రోల్ లో కనిపించనున్నాడు. రేణు దేశాయ్ ,అనుపమ్ ఖేర్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. వంశీ దర్శకుడు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగు తోపాటు హిందీ ,తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అక్టోబర్ 20న ఈ సినిమా ప్రేక్షకులముందుకు రానుంది.

ఇక ఇవే కాకుండా తాజాగా మరో సినిమా కూడా దసరా బరిలో నిలిచింది. బాలకృష్ణ ,అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈసినిమా కూడా దసరా కు విడుదలకానుందని అఫీషియల్ గా ప్రకటించారు. అయితే రిలీజ్ డేట్ ను మాత్రం రివీల్ చేయలేదు. ఈచిత్రం అయితే అక్టోబర్ 20న లేదా 21న విడుదలయ్యే అవకాశాలు వున్నాయి. షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న ఈసినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా శ్రీ లీలా ,బాలకృష్ణ కూతురుగా కనిపించనుంది.

ఇక ఇప్పటివరకు ఈ సినిమాలు మాత్రం దసరాకు విడుదలను ఫిక్స్ చేసుకున్నాయి. మరి ఈజాబితాలో ఇంకేమైనా చేరుతాయో లేదో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.