#NBK108 మూవీ లో బాలకృష్ణ స్టైలిష్ లుక్

Nandamuri Balakrishna Stylish Look Out From NBK108 Movie

అఖండ, వీర సింహారెడ్డి వంటి వరుస బ్లాక్ బస్టర్ మూ వీస్ తో దూసుకుపోతోన్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం #NBK 108 మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ , కాజల్ అగర్వాల్ జంటగా #NBK108 మూవీ తెరకెక్కుతుంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ లో శరత్ కుమార్, శ్రీ లీల, బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ రాంపాల్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

#NBK108 మూవీ లో బాలకృష్ణ మూడు గెటప్స్ లో కనిపించబోతున్నారనీ.. పాత్ర ఒక్కటే అయినా.. మూడు స్టేజ్ ల్లో మూడు లుక్స్ లో బాలయ్య కనిపిస్తారనీ.. ముప్పై ఏళ్ల యువకుడి గెటప్ తో పాటు ఏభై ఏళ్ల వ్యక్తిగా.. అలాగే డెబ్బై ఏళ్ల పెద్దాయన గా కూడా కనిపించబోతున్నారనీ సమాచారం. ఉగాది సందర్భంగా చిత్ర యూనిట్ బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేయగా దానికి బాలయ్య ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ నుండి కూడా మంచి రెస్పాన్స్ లభించింది. ఇప్పుడు ఈ మూవీ నుండి బాలయ్య మరొక స్టైలిష్ లుక్ బయటకు వచ్చింది. ఆకట్టుకునే హెయిర్ స్టైల్, గడ్డంతో పాటు సన్ గ్లాసెస్ అలానే మెడలో స్కార్ఫ్ తో బాలయ్య ఈస్టైలిష్ లుక్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ స్టైలిష్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × five =