ఆర్ఆర్ఆర్ తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 15వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో చేస్తున్నాడని తెలిసిందే. సగానికి పైగా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది ఈచిత్రం. ఈరోజు రామ్ చరణ్ బర్త్ డే సందర్బంగా ఉదయం ఈసినిమా టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఇంతకుముందు ఈసినిమా టైటిల్, సీఈఓ అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది అయితే ఆ టైటిల్ ఫేక్ అని తేలిపోయింది. మేకర్స్ ,ఈసినిమాకు ‘గేమ్ ఛేంజర్‘ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇక టైటిల్ తో ఆగకుండా రామ్ చరణ్ ఫ్యాన్స్ కు చిత్ర బృందం మరో సప్రైజ్ కూడా ఇచ్చారు. కొద్దీ సేపటి క్రితం రామ్ చరణ్ ఫస్ట్ లుక్ ను కూడా విడుదలచేశారు. అందులో చరణ్ అల్ట్రా స్టయిలిస్జ్ లుక్ తో అదరగొట్టాడు. ఈపోస్టర్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. అయితే ఈసినిమాలో చరణ్, డిఫ్రెంట్ లుక్స్ తో కనిపించనున్నాడట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Here's the first look of #GameChanger
Happy Birthday Megapower Star @AlwaysRamCharan💥@shankarshanmugh @advani_kiara @yoursanjali @DOP_Tirru @MusicThaman @artkolla @SVC_official #SVC50 #RC15 #HBDGlobalStarRamCharan pic.twitter.com/JpGohGhaeh
— Sri Venkateswara Creations (@SVC_official) March 27, 2023
సోషల్ మేసేజ్ తో తెరకెక్కుతున్న ఈచిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండగా కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీకాంత్ ,ఎస్ జె సూర్య , నవీన్ చంద్ర ,అంజలి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా తెలుగు తోపాటు తమిళ భాషలో విడుదలకానుంది.
ఇక ఈ సినిమా తరువాత రామ్ చరణ్ తదుపరి చిత్రాన్ని’ ఉప్పెన’ ఫేమ్ బుచ్చి బాబు సాన డైరెక్ట్ చేయనున్నాడు. పాన్ ఇండియా మూవీ గా రానున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ,వ్రిద్ది సినిమాస్ , సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా అఫిషీయల్ గా లాంచ్ కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: