వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్స్ పై విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో విశ్వక్ సేన్, నివేత పేతురాజ్ జంటగా తెరకెక్కిన ధమ్కీ మూవీ ఉగాది కానుకగా మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా రిలీజ్అయ్యి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ ఇతర పాత్రల్లో నటించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు.
హీరోగా విశ్వక్ సేన్ రెండు పాత్రల మధ్య వేరియేషన్ చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నివేత పేతురాజ్ తన గ్లామర్ తో ప్రేక్షకులను అలరించారు. రావు రమేష్ సైతం పాత్రలో వేరియేషన్స్ బాగా చూపించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన ధమ్కీ మూవీ నాలుగురోజుల్లో 8. 37 క్రోర్స్ కలెక్షన్స్ రాబట్టి , నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 18. 60 కోట్ల గ్రాస్ , 9. 56 కోట్ల షేర్ తో దూసుకుపోతోంది. హీరో విశ్వక్ సేన్ దర్శకత్వంలో తెరకెక్కిన ధమ్కీ మూవీ ఎవరూ ఊహించని విధంగా హిట్ టాక్ తో భారీ కలెక్షన్స్ రాబడుతుండటం విశేషం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: