ఈమధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మరో సినిమా కాంతార. రిషబ్ శెట్టి దర్శకత్వంలో చాలా సహజంగా అడవి, అడవిలోని మనుషుల జీవనం, వారి సెంటిమెంట్, దైవం, అమాయకజనాన్ని మోసం చేయడం అనే అంశాలపై ఈసినిమాను తెరకెక్కింది. అయితే ఈసినిమా కన్నడలో ఎలాంటి అంచనాలు లేకుండానే బాక్సాఫీస్ బరిలో దిగింది. కానీ అక్కడ ఈసినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఇక్కడ కూడా రిలీజ్ చేశారు. ఇక ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఊహించని రీతిలో క్రేజ్ ను సొంతం చేసుకుంది. మరింత క్రేజ్ పెరిగడంతో హిందీలో కూడా రిలీజ్ చేశారు. అక్కడ కూడా ఈసినిమా సూపర్ హిట్ అయి సాలిడ్ కలెక్షన్స్ అందించింది. ఇక ఐక్యరాజ్యసమితిలో కూడా ఈసినిమాను ప్రదర్శించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమాకు సీక్వెల్ కూడా వస్తున్నట్టు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో ఉగాది పండుగ సందర్భంగా దీనికి సంబంధించిన క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఉగాది పండుగ సందర్భంగా `కాంతార` రెండో పార్ట్ కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రారంభమైందని అధికారికంగా తెలియచేశారు. ఇక దీంతో అభిమానులు ఫుల్ హ్యాపీలో ఉన్నారు. ఇక ఈఏడాది మొదలుపెట్టి వచ్చే ఏడాది ఈసినిమాను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తుంది.
కాగా కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన కాంతార సినిమాలో అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి, సప్తమీ గౌడ తదితరులు నటించారు. హెంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మించారు. అజిత్ లోక్ నాథ్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫి, ప్రతీక్ శెట్టి ఈసినిమాకు ఎడిటర్ గా పనిచేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: