నేడు ఉగాది పండుగ సందర్భంగా కొత్త సినిమాల నుండి వరుస అప్ డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఈనేపథ్యంలోనే బాలకృష్ణ 108 సినిమా నుండి కూడా సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా 108 సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక మరోవైపు ఈసినిమాలో నటిస్తున్న కీలకనటులకు సంబంధించిన పోస్టర్లను వరుసగా రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్ గానే ఈసినిమాలో నటిస్తున్న శ్రీలీల, కాజల్ పోస్టర్లను రిలీజ్ చేశారు. ఇక నేడు ఉగాది పండుగ సందర్భంగా ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక పోస్టర్స్ పై దిస్ టైమ్ బియాండ్ యువర్ ఇమాజినేషన్ అంటూ రాశారు. దీంతో బాలయ్యను ఇంతకు ముందెన్నడు చూపించని విధంగా చూపించబోతున్నట్టు అర్థమవుతుంది. ఇక ఒక పోస్టర్ లో బాలయ్యసీరియస్ లుక్ లో నిల్చొని మెడలో కండువా చుట్టుకొని ఉండగా. మరో పోస్టర్ లో బాలయ్య పవర్ ఫుల్ గా చూస్తున్నట్టు ఉంది. దీంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.
Celebrate this UGADI with the Arrival of #NBKLikeNeverBefore 🔥
Presenting the FirstLook of Natasimham #NandamuriBalakrishna from #NBK108 💥
This time,beyond your imagination!@AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @MusicThaman @sahugarapati7 @harish_peddi @YoursSKrishna pic.twitter.com/i1zP90B0aB
— Shine Screens (@Shine_Screens) March 22, 2023
కాగా ఈసినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీలీల ఒక కీలక పాత్రలో నటిస్తుంది. ప్రియాంక జవాల్కర్ కూడా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈసినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఇక ఈసినిమాలో బాలకృష్ణ కుమార్తెగా శ్రీలీల అలరించనుందంట. ఈ చిత్రానికి కూడా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: