నేను ఇంకా 73 కథలు వినాలి

natural star nani about his story selection

న్యాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న సినిమా దసరా. ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూసే సినిమా దసరా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రఫ్ అండ్ రస్టిక్ లుక్ తో తెలంగాణ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాతో నాని అలరించడానికి వస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ తో పెంచిన క్యూరియాసిటీని ఇప్పటివరకూ ఎక్కడా తగ్గించలేదు. వచ్చిన ప్రతి అప్ డేట్ సినిమాపై అంచనాలను అంతకంతకూ పెంచాయి తప్పా.. తగ్గించలేదు. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలు మరింత పెంచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్న నాని ఈసినిమా గురించి అనేక ఆసక్తిర విషయాలు తెలియచేశారు. తాజాగా మరో ఇంటర్వ్యూలో పాల్గొన్న నాని కథల ఎంపిక విషయం గురించి చెబుతూ పలు ఆసక్తిర విషయాలు పంచుకున్నాడు. శ్రీకాంత్ ఓదెల దసర కథ చెప్పడానికి వచ్చినప్పుడు నేను కొంచెం బిజీగా ఉన్నాను. దాంతో ఒక గంటలో కథ చెప్పేయమని అన్నాను. కానీ ఆయన కథను చెప్పడం మొదలుపెట్టిన తరువాత నాలుగు గంటల పాటు అలా వింటూ ఉండిపోయాను. దీనిని బట్టి కథలో ఎంత విషయం ఉందనేది మీరే అర్థం చేసుకోవచ్చును అన్నాడు. కానీ నాని కథ వినడానికి ఎక్కువ టైమ్ ఇవ్వడు అంటూ ఉంటారు. నిజానికి ఒక అరగంట వినగానే ఆ కథలో విషయం ఉందా లేదా అనేది అర్థమైపోతుంది. 3 గంటలు వినేసి బాగోలేదంటే బాధపడతారు. వాళ్ల సమయం వేస్ట్ అవుతుంది. నా విషయానికే వస్తే ఇంకా నేను వినవలసినవి 73 కథలు ఉన్నాయి. సమయం దొరికినప్పుడల్లా వింటూనే ఉంటాను అని చెప్పుకొచ్చాడు.

కాగా ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా, సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడిగా.. ఎడిటర్‌గా నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా అవినాష్‌ కొల్లా, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా విజయ్‌ చాగంటి వ్యవహరిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − eleven =