ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా పోర్ట్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న #NTR30 మూవీ మార్చి 23 వ తేదీ ప్రారంభం కానుందని సమాచారం. ఏప్రిల్ మొదటి వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. #NTR30 మూవీ తెలుగు తో పాటు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషలలో 2024 ఏప్రిల్ 5 వ తేదీ రిలీజ్ కానుంది.బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా ఎంపిక అయిన విషయం తెలిసిందే. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన హీరోయిన్ జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ కూడా చాలా బాగుండి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా టాలీవుడ్‌లో అవకాశం రావడం పట్ల జాన్వీ కపూర్ స్పందించి, ఎన్టీఆర్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.జూనియర్ ఎన్టీఆర్ అంటే తనకు చాలా ఇష్టం అనీ , ఆయనతో పనిచేసే అవకాశం వస్తే బాగుండని ఇప్పటికే చాలా సార్లు చెప్పాననీ , జూనియర్ ఎన్టీఆర్‌తో నటించడం ఓ కల అనీ , ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాను మళ్లీ చూశాననీ , ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం తన జీవితంలోనే అతిపెద్ద ఆనందాల్లో ఒకటనీ , తారక్‌తో వర్క్ చేయాలని ప్రతి రోజూ దేవుడిని ప్రార్థించేదాన్ననీ చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: