శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన యాక్షన్ మాస్ ఎంటర్ టైనర్ దసరా మూవీ మార్చి 30 వ తేదీ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. ఈ మూవీలో కీర్తి సురేష్ కథానాయిక. సాయి కుమార్, షైన్ టామ్ చాకో, దీక్షిత్ శెట్టి, సముద్రఖని, జరీనా వహాబ్ ముఖ్య పాత్రలలో నటించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. ఇప్పటికే చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.హీరో నాని ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న దసరా మూవీ ప్రమోషన్స్ ను పలు భాషల్లో మేకర్స్ భారీ ఎత్తున చేపట్టారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
విశాఖపట్నం వేదికగా భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాలీవుడ్ హీరో న్యాచురల్ స్టార్ నాని సందడి చేశారు. తన తాజా సినిమా దసరా ప్రమోషన్లలో భాగంగా ఇక్కడకు వచ్చేసిన అతను కామెంటేటర్‌గా అవతారమెత్తాడు.మ్యాచ్ ప్రారంభానికి ముందు సునీల్ గవాస్కర్, ఆరోన్ ఫించ్, లేడీ కామెంటేటర్‌తో నాని ముచ్చట్లు పెట్టారు. వారు అడిగే ప్రశ్నలకు సమధానాలు ఇస్తూనే బ్యాట్ పట్టుకుని వివిధ రకాల స్టిల్స్‌తో ఫొటోలకు పోజులిచ్చారు . ఈ సందర్భంగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన ఆల్ టైమ్ ఫేవరెట్ ప్లేయర్ అని చెప్పారు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆరోన్ ఫించ్‌కు దసరా సినిమా లోని ధూమ్ ధామ్ సిగ్నేచర్ స్టెప్‌ను నాని నేర్పించారు . ఇద్దరూ కలసి ఆ స్టెప్ వేసేసరికి అభిమానుల కేరింతలు, ఈలలతో వైజాగ్ స్టేడియం దద్దరిల్లిపోయింది.టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు జెంటిల్‌మెన్ అనీ , కింగ్ విరాట్ కోహ్లీకి గ్యాంగ్ లీడర్ , హార్దిక్ పాండ్యాకు పిల్ల జమీందార్ అనీ నాని తన సినిమాల టైటిల్స్ సూట్ అవుతాయని చెప్పారు.
View this post on Instagram
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: