మగధీర రీరిలీజ్ పై మేకర్స్ క్లారిటీ

ram charans magadheera movie re release postponed

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమాల్లో ‘మగధీర’ సినిమాకు మాత్రం ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎస్‌ఎస్‌ రాజమౌళి, మెగాపవర్‌ స్టార్‌ రామ్ చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా తెలుగు సినిమా రికార్డులను తిరగరాసింది. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడమే కాకుండా తెలుగు సినిమా సత్తాను చాటింది. హార్స్‌ రైడింగ్‌, కాజల్‌ గ్లామర్‌, శ్రీహరి-రామ్‌చరణ్‌ మధ్య డైలాగ్‌ వార్‌ ఈ చిత్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక అవార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది ఈసినిమా. మగధీర’ చిత్రం మొత్తం తొమ్మిది నంది అవార్డులు కైవసం చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈమధ్య రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే ఈసినిమాను కూడా రీరిలీజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈసినిమా రీరిలీజ్ చేయాలని ప్లా చేశారు. అయితే గతకొద్దిరోజుల నుంచి రీ రిలీజ్ వాయిదా అన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల మగధీర రీ రిలీజ్ ని వాయిదా వేస్తున్నామని.. మరో మంచి అకేషన్ కి ఈ రిలీజ్ ప్లాన్ తో మళ్ళీ వస్తామని తెలిపారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here