మణిరత్నం దర్శకత్వంలో భారీ తారాగణంతో, భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమా పొన్నియన్ సెల్వన్. రెండు పార్ట్ లుగా వస్తున్న ఈసినిమా మొదటి పార్ట్ ఇప్పటికే రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. చాలా కాలం తరువాత పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈసినిమా ఆయనకు సూపర్ హిట్ ను అందించింది. ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూడా భారీ కలెక్షన్స్ ను అందించి పలు రికార్డులు కూడా క్రియేట్ చేసింది. ఇక ఈసినిమా సెకండ్ పార్ట్ ఏప్రిల్ 28వ తేదీన రిలీజ్ అవుతుంది. ఇక ఈసినిమా ప్రమోషన్స్ ను చిన్నగా మొదలుపెట్టారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈసినిమా ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను మార్చి 20వ తేదీన సాయంత్రం 6గంటలకు రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈసందర్భంగా త్రిష, కార్తీ ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేయగా అది ఆకట్టుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో విక్రమ్, కార్తీ, త్రిష, పార్తిబన్, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, జయరామ్, జయం రవి తదితరులు కీలకపాత్రల్లో నటించారు. మరి రెండో పార్టులో కూడా వీరంతా ఉంటారా..? లేదంటే.. కొత్త వారు ఎవరైనా యాడ్ అవుతారా..? అనేది తెలియాలి.. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మించాయి. తమిళంతో పాటు హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈసినిమా రిలీజ్ కానుంది. ఈసినిమాకు ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: