ఎమోషనల్ రైడ్ గా రంగమార్తాండ టీజర్

rangamarthanda movie teaser out now

టాలీవుడ్‌లో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ప్రస్తుతం నానా పాటేకర్ హీరోగా నటించిన మరాఠీ మూవీ ‘నట సమ్రాట్’ సినిమాను తెలుగులో ‘రంగమార్తాండ’గా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా మరికొద్దిరోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు. ఈసినిమా నుండి ఇప్పటివరకూ రిలీజ్ అయిన పోస్టర్లు, అలానే పాటలు సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. దానికి తోడు రీసెంట్ గానే టాలీవుడ్ సెలబ్రిటీలు కొంతమందికి ప్రీమియర్ షో నిర్వహించాడు కృష్ణవంశీ. ఇక సినిమా చూసిన వారందరూ సినిమాపై ప్రశంసలు కురిపించారు. సింగర్ సునీత కూడా తన సోషల్ మీడియా ద్వారా సినిమాపై, కృష్ణవంశీపై ప్రశంసలు కురిపించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేసింది. కృష్ణవంశీ సినిమా అంటే ఎమోషన్స్, అలానే లోతైన భావాలు ఉంటాయి. ఇక ఇప్పుడు రిలీజ్ అయిన టీజర్ చూస్తుంటే ఎమోషనల్ రైడ్ గా ఉంది. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం వారి పాత్రల్లో నటించలేదు.. ఆ పాత్రల్లో పరకాయప్రవేశం చేశారని చెప్పొచ్చు. ముఖ్యంగా కామెడీ కింగ్ బ్రహ్మీలోని మరో కోణం ఈసినిమాలో చూడొచ్చు. రేయ్ .. నువ్వొక చెత్త నటుడివిరా .. మనిషిగా అంతకంటే నీచుడివి’ అని ప్రకాశ్ రాజ్ ను బ్రహ్మానందం చెంపదెబ్బ కొట్టడం.. నేనొక నటుడిని అంటూ ప్రకాశ్ రాజ్ చెప్పే డైలాగ్స్ హైలెట్ గా నిలిచాయి.

కాగా ఈసినిమాలో ప్ర‌కాశ్ రాజ్‌ తో పాటు ర‌మ్య‌కృష్ణ‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్, రాహుల్ సిప్లిగంజ్ ఇత‌ర నటీన‌టులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అంతేకాదు ఈసినిమాకు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ అందిస్తున్న సంగతి తెలిసిందే కదా. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × three =