కేవలం హీరోగా మాత్రమే కాదు విలన్ గా.. మరోపక్క సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు ఆది పినిశెట్టి. తను ప్రతి సినిమాకు ఓ విభిన్నత ఉండేలా చూసుకుంటాడు ఆది. అందుకే అటు తమిళ్ లోనూ ఇటు తెలుగులోనూ మంచి రోల్స్ చేసుకుంటూ వెళ్తున్నాడు. వైవిధ్యమైన కథల్ని మాత్రం పరిచయం చేయడంలో మాత్రం సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు మరో హార్రర్ సినిమాతో ప్రేక్షకులను భయపెట్టడానికి వచ్చేస్తున్నాడు. అరివజ్జగన్ దర్శకత్వంలో హార్రర్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వైశాలి అనే సినిమా వచ్చింది. ఈసినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే కదా. దీంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా కు శబ్దం అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ ఆ మధ్య పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. టైటిల్ పోస్టరే సినిమాపై ఆసక్తిని పెంచేసింది. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. తాజాగా ఈసినిమా మునార్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈవిషయాన్ని చిత్రయూనిట్ తెలియచేసింది.
కాగా ఈసినిమాను 7జీ ఫిలింస్ ఇంకా ఆల్ఫా ఫ్రేమ్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మించనున్నారు. ఈసినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను కూడా తమిళంతో పాటు తెలుగులోనూ తెరకెక్కించనున్నారు. ఇంకా ఈసినిమాలో నటించే నటీనటులు, మిగిలిన విషయాల గురించి తెలియాలంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: