సినిమా సినిమాకు కొత్తదనం ఉండేలా చూసుకునే హీరోల్లో శ్రీవిష్ణు ముందుంటాడు. సినిమా విజయాపజయాలను పట్టించుకోకుండా తను చేసే సినిమాలు డిఫరెంట్ గా ఉండాలని చూసుకుంటాడు. అందుకే శ్రీవిష్ణు నుండి సినిమా వస్తుందంటే ప్రేక్షకులకు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. గత ఏడాది అల్లూరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శ్రీ విష్ణు. ఇక ఇప్పుడు కొంత గ్యాప్ తరువాత తన కొత్త ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టేశాడు. నేడు ఈసినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. తాజాగా ఈసినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈసినిమాకు సామజవరగమన అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ఇప్పటికే ఈసినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టి కొంతవరకూ షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మా గందరగోళ చిక్కుముడులతో మీకు ఇక నవ్వుల #సామజవరగమన 😉
Presenting you all the Title & first look of my next #Samajavaragamana ♥️
Ee Summer Endalalo Challani Navvulatho Kaluddham🤗
Directed by @RamAbbaraju@Reba_Monica @AnilSunkara1 @RajeshDanda_ @_balajigutta @GopiSundarOffl pic.twitter.com/1TFtnUVrnT
— Sree Vishnu (@sreevishnuoffl) February 14, 2023
కాగా ఈసినిమాలో రెబా మోనికా జాన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ‘వివాహ భోజనంబు’ వంటి కామెడీ చిత్రాన్ని తెరకెక్కించిన రామ్ అబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. ఏకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్, హాస్య మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు. సమ్మర్ లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు కూడా ప్రకటించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: