తమిళ్ టాలెండెట్ స్టార్ హీరో ధనుష్ గురించి, తన నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక తెలుగులో తనకు ఎంత క్రేజ్ ఉందో కూడా తెలిసిందే. ఇప్పటివరకూ తన సినిమాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. ఇక ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగులో సినిమా చేస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా సార్. ధనుష్ తెలుగులో నటిస్తోన్న తొలి సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఫిబ్రవరి 17వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు పాటలు కూడా ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇదిలా ఉండగా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. ఫిబ్రవరి 8వ తేదీన ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.
కాగా ఈసినిమాలో ధనుష్ కు జోడీగా.. సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా సాయికుమార్,తనికెళ్ల భరణి , నర్రాశ్రీను కీలక పాత్రల్లో నటించనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమాకు జి.వి. ప్రకాష్‌కుమార్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా దినేష్ కృష్ణన్ పనిచేయనున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: