శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకత్వంలో విశ్వాసం ఫేమ్ అనికా సురేంద్రన్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా బుట్టబొమ్మ. అనికా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. బాలనటిగా ఎన్నో సినిమాల్లో నటించిన అనికా ఇప్పుడు హీరోయిన్ గా సినిమాతో హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చేస్తుంది. ఇక ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ లు ఇప్పటికే మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. మరి ఈసినిమా నేడు రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసినిమా ఎలా ఉందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు.. అనికా సురేంద్రనే, అర్జున్ దాస్, సూర్య వశిష్ట, నవ్యస్వామి తదితరులు
దర్శకత్వం.. శౌరి చంద్రశేఖర్ టి రమేష్
బ్యానర్స్.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
నిర్మాతలు.. నాగ వంశీ ఎస్, సాయి సౌజన్య
సంగీతం.. గోపీ సుందర్
సినిమాటోగ్రఫి.. వంశీ పచ్చిపులుసు
కథ..
సత్య(అనిఖా సురేంద్రన్) తన తల్లి దండ్రులతో కలిసి అరకు సమీపంలోని ఓ గ్రామంలో నివసిస్తూ ఉంటుంది. తండ్రి రైస్‌మిల్లులో పనిచేస్తుండగా, తల్లి ఇంట్లోనే కుట్టుమిషన్ నడిపిస్తుంటుంది. మధ్య తరగతి కుటుంబం కావడంతో సత్య కూడా తన తల్లిదండ్రులకు సహాయ పడుతుంటుంది. ఇదిలా ఉండగా ఒకరోజు సత్య తను కుట్టుమిషన్ పనిమీద రాంగ్ నెంబర్‌కి కాల్ చేస్తుంది. అది మురళీ(సూర్య వశిష్ట) అనే ఆటో డ్రైవర్‌కి వెళ్తుంది. మొదటినుండి మంచి వాయిస్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకునే సూర్యకు సత్య వాయిస్ నచ్చి ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తాడు. ఎట్టకేలకు ఫోన్ చేసి మాటలు కలుపుతాడు. అలా వారిద్దరూ ప్రేమలో పడతారు. ఇలా సాగుతుండగా మరోవైపు సత్యను రైస్ మిల్లు ఓనర్ తనయుడు ప్రేమిస్తాడు.. వారికి ఎంగేజ్ మెంట్ కూడా అవుతుంది. తనకు పెళ్లి ఇష్టం లేకపోవడంతో మురళీని కలిసేందుకు సత్య వైజాగ్ వెళ్తుంది. మరి అక్కడికి వెళ్లాక మురళీని కలిసిందా? అక్కడ సత్యని ఆర్కే(అర్జున్ దాస్) ఎందుకు కలిశాడు? ఆమెను ఎందుకు ఫాలో అవుతుంటాడు? చివర్లో వచ్చే ట్విస్ట్ ఏంటి? అన్నది మిగిలిన కథ..
విశ్లేషణ..
ఇప్పుడు సినీ ఇండస్ట్రీల్లో బౌండరీస్ అనేవి చెరిగిపోయాయి. వేరే భాషల్లో సినిమాలను కూడా మన నిర్మాతలు ఇక్క రిలీజ్ చేసేస్తున్నారు. కథలో కంటెంట్ ఉందా లేదా అన్నది మాత్రమే చూస్తున్నారు. అందుకే చిన్న సినిమాలు కూడా ఈమధ్య కాలంలో మంచి ఆదరణను చోటుచేసుకుంటున్నాయి. ఇప్పుడు అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమానే బుట్టబొమ్మ. మలయాళంలో విజయం సాధించిన `కప్పేలా` మూవీకి ఇది రీమేక్ అన్న సంగతి తెలిసిందే కదా. ఆ సినిమా చూసిన వారికి ఈసినిమా కథ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోనూ ఈసినిమా ఓటీటీలో రిలీజ్ అయింది. ఓటీటీల పుణ్యమా అంటూ ఇప్పుడు ఇంట్లోనే కూర్చొని సినిమాలు చూసేస్తున్నారు అందరూ. ఈనేపథ్యంలోనే ఒకసారి అందరూ చూసేసిన సినిమాను మరోసారి చూసేలా చేయాలంటే అంత ఈజీ కాదు.
ఆ విషయంలో దర్శకుడు శౌరి సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. మలయాళం వెర్షన్‌ను ఉన్నది ఉన్నట్టు తీయకుండా తెలుగు నేటివిటి, తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా మార్పులు చేయడం ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. పాత్రలను తీర్చి దిద్దిన విధానం.. కొన్ని పాత్రలను యాడ్ చేసిన విధానం బాగుంది. మురళీ క్యారెక్టర్, అలాగే రామకృష్ణ క్యారెక్టర్‌ను ఇంప్రూవైజ్ చేసిన విధాన.. రామకృష్ణ లవర్ గా నవ్యస్వామి క్యారెక్టర్‌ను యాడ్ చేయడం మరింత ఫీల్‌గుడ్‌గా మార్చేసింది. లవ్ స్టోరీకి హ్యూమన్ ట్రాఫికింగ్ పాయింట్‌ను జోడించి తీసిన సినిమా ఇది. ఫోన్‌లు, సోషల్ మీడియా ద్వారా అపరిచితులతో ఏర్పడిన పరిచయాలు, ప్రేమలు ఎలాంటి అనర్థాలకు దారితీస్తాయన్నది సందేశాత్మకంగా ఈ సినిమాలో చూపించారు.
ఫస్ట్ హాఫ్ మొత్తం అనిఖా సురేంద్రన్ కుటుంబనేపథ్యం, మురళీతో ఫోన్ ద్వారా ప్రేమలో పడే సన్నివేశాలతో ఆహ్లాదకరంగా సాగుతుంది. మురళీని కలవడానికి వైజాగ్ రావడం అతడి పేరుతో అర్జున్‌దాస్ అక్కడికి వచ్చే సీన్‌తో సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు డైరెక్టర్. సెకండాఫ్‌లో సత్యను కాపాడానికి అర్జున్ దాస్ చేసే ప్రయత్నాలతో థ్రిల్లింగ్‌గా సాగుతుంది.
పెర్ఫామెన్స్..
ఈసినిమాకు మెయిన్ అనికా పాత్రే ప్రధానం అని చెప్పనక్కర్లేదు. ఈసినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అనికా తన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటుంది. అమాయకంగా ఉండే పాత్రలో తను ఒదిగిపోయి నటించేసింది. ఇక అర్జున్ దాస్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన పాత్ర సెకండ్ హాఫ్ లో వచ్చినా.. ఫుల్ మార్కులు కొట్టేశారనే చెప్పాలి. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో మెప్పించాడు. మురళీ పాత్రలో సూర్య వశిష్ట బాగా చేశాడు. తన పాత్రలోని ట్విస్ట్ ఆకట్టుకునేలా ఉంటుంది. సత్య ఫ్రెండ్ పాత్రలో చేసిన అమ్మాయి కూడా మెప్పించింది. మిగిలిన వారు తమ పాత్రల మేర బాగానే నటించారు.
టెక్నికల్ వాల్యూస్
ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫి మాత్రం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. గ్రామీణ, అడవి వాతావరణాన్ని సినిమాటోగ్రాఫర్ వంశీ పచ్చిపులుసు కెమెరాలో బంధించిన తీరు బాగుంది. పాటల సంగతి పక్కన పెడితే గోపి సుందర్ అందించిన బీజీఎం సినిమాకు ప్లస్‌గా మారింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఓవరాల్ గా చెప్పాలంటే లవ్ స్టోరీస్ ఇష్టపడే వారికి ఈసినిమా నచ్చేస్తుంది. అంతేకాదు ఈసినిమాను ఫ్యామిలీ అందరూ కలిసి చూసే సినిమా అని కూడా చెప్పొచ్చు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.