యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై సిద్ధార్థ్ ఆనంద్ దర్శాకత్వంలో షారుఖ్ ఖాన్, దీపికా పడుకొనే జంటగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పఠాన్ హిందీ మూవీ జనవరి 25 వ తేదీ పలు భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. జాన్ అబ్రహాం కీలక పాత్రలో నటించగా స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటించారు. విశాల్ శేఖర్ సంగీతం అందించారు. షారుఖ్ ఖాన్ వన్ మ్యాన్ షో ఈ మూవీలో పఠాన్ పాత్రలో షారుఖ్ ఖాన్ అద్భుతంగా నటించి సినిమాకు హైలైట్ గా నిలిచారు. దీపికా పడుకొనే తన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అతిథి పాత్రలో నటించిన సల్మాన్ ఖాన్ ఈ మూవీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పఠాన్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 106 కోట్లు వసూళ్ళు సాధించి, మొదటి రోజే 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఈమూవీ మూడు రోజులకు 300 కోట్లకు పైగా కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. కశ్మీర్ లోయలోని థియేటర్స్ కి ప్రేక్షకులు తక్కువగా వస్తూ ఉంటారు. అక్కడ ఉన్న ఉగ్రవాద సమస్యల వల్ల గతంలో థియేటర్స్ కూడా సరిగ్గా రన్ చేయలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలతో 2021 నుంచి అక్కడ థియేటర్స్ ని మళ్ళీ బాగు చేసి రన్ చేస్తున్నారు. అక్కడి పాత థియేటర్స్ ని తీసుకొని ఐనాక్స్ లాంటి సంస్థలు మల్టిప్లెక్స్ లుగా మార్చాయి. అలా మార్చిన ఓ ఐనాక్స్ థియేటర్ లో తాజాగా పఠాన్ సినిమా రిలీజయింది. అయితే దాదాపు 32 సంవత్సరాలుగా ఆ థియేటర్ లో హౌస్ ఫుల్ కాలేదనీ.. పఠాన్ సినిమా వల్ల 32 ఏళ్ళ తర్వాత మళ్ళీ అక్కడి థియేటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డులు పెట్టారనీ సమాచారం. దీనిపై ఐనాక్స్ స్పెషల్ ట్వీట్ చేసింది. కశ్మీర్ లోయలోని ఆ థియేటర్ బయట హౌస్ ఫుల్ బోర్డు ఉన్న ఫోటోని షేర్ చేసి.. దేశమంతా పఠాన్ సినిమా సందడి చేస్తున్న సమయంలో 32 సంవత్సరాల తర్వాత కశ్మీర్ లోయలోని మా థియేటర్లో హౌస్‌ఫుల్ బోర్డుని తీసుకొచ్చినందుకు కింగ్ ఖాన్‌కు మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యు షారుఖ్, పఠాన్ టీం అని పోస్ట్ చేసింది. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: