మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ వీరసింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి, విజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటించారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. వీరసింహారెడ్డి మూవీలో వీర సింహారెడ్డిగా, జయసింహా రెడ్డిగా రెండు పాత్రల్లో అద్భుతంగా నటించిన హీరో బాలకృష్ణ ప్రేక్షక, అభిమానులను ఆకట్టుకున్నారు. కొన్ని ఎమోషనల్ అండ్ యాక్షన్ సన్నివేశాల్లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని బాలకృష్ణ ఈ మూవీకి హైలైట్ గా నిలిచారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బ్లాక్ బస్టర్ అఖండ మూవీ తర్వాత రూ. 100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరిన బాలయ్య రెండవ చిత్రంగా వీరసింహారెడ్డి మూవీ రికార్డ్స్ క్రియేట్ చేసింది. అఖండ సినిమా మొదటి వారం రూ. 53.49 కోట్ల షేర్ (రూ. 87.9 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధిస్తే.. వీరసింహారెడ్డి మూవీ 1 వారంలోనే రూ. 68.51 కోట్ల షేర్ (రూ. 114.95 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించింది. అఖండ మూవీ టోటల్ వసూళ్ళని వీరసింహా రెడ్డి మూవీ కేవలం ఈ 8 రోజుల్లోనే కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.దీనితో వీరసింహా రెడ్డి బాలయ్య కెరీర్ లోనే ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అంతేకాదు వీర సింహారెడ్డి విడుదలైన 3 రోజుల్లోనే USAలో బ్రేక్‌ఈవెన్ మార్క్‌ను చేరుకుంది. ఇక ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్‌గా 70 కోట్ల షేర్‌ను వసూలుచేసింది . ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కు చేరువలో ఉంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: