స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం లో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో గోండు వీరుడు కొమురం భీమ్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది క్రేజీ హీరోగా మారారు. లాస్ ఏంజెల్స్ లో జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుకకు అటెండ్ అయిన ఎన్టీఆర్ తిరిగి హైదరాబాద్ కు చేరుకున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న #NTR30 మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మూవీ తరువాత దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక మూవీకి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
జనవరి 18న హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే జరగనుంది. శ్రీలంకపై సిరీస్ విజయాలను సాధించిన టీమిండియా న్యూజిలాండ్ తో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ తో పాటు మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లను ఆడనుంది.హైదరాబాద్ కు చేరుకున్న భారత జట్టులోని కొందరు సభ్యులు జూనియర్ ఎన్టీఆర్ ను కలుసుకున్నారు. సూర్యకుమార్ యాదవ్, శుబ్ మన్ గిల్, ఇషాన్ కిషన్, యుజువేంద్ర చహల్, శార్దుల్ ఠాకూర్ సోమవారం రాత్రి ఎన్టీఆర్ ను కలుసుకొని
నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకున్న సందర్భంగా ఎన్టీఆర్ కు అభినందనలు తెలిపారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: