సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఉన్న అన్ స్టాపబుల్ సీజన్ 2 ప్రముఖ ఓటీటీ యాప్ ఆహా లో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రోగ్రామ్ కు హీరో ప్రభాస్, యాక్షన్ స్టార్ గోపీచంద్ తో కలిసి గెస్ట్ గా పాల్గొన్నారు. వీరిద్దరూ కలిసి వచ్చిన ఈ ఎపిసోడ్ రెండు భాగాలుగా ప్రసారం చేయదానికి ఆహా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. మొదటి భాగం 29 వ తేదీ రాత్రి 9 గం. లకు ప్రసారం చేయగా, పలు సరదా సరదా ప్రశ్నలు ఎంటర్టైన్మెంట్ అంశాలతో కొనసాగి ప్రేక్షకులను ఆకట్టుకుని, 100 మిలియన్లకు పైగా వ్యూయింగ్ మినిట్స్ ను నమోదు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అన్ స్టాపబుల్2 ప్రభాస్ ఎపిసోడ్ రెండో భాగం జనవరి 6న స్ట్రీమింగ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కూడా ఎంటర్ టైనింగ్ గా సాగి ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీపికా పడుకొనే, సమంత పొరపాటున సముద్రంలో మునిగిపోతే, నువ్వు ముందుగా ఎవరిని రక్షిస్తావ్.? అని బాలయ్య అడిగిన ప్రశ్నకు దీపికా పడుకొనే.. ఎందుకంటె దీపిక లేకపోతే తమ చిత్రం ప్రాజెక్ట్ కే ఆగిపోతుంది కాబట్టి దీపికను కాపాడతానని ప్రభాస్ ఫన్నీ సమాధానంఇచ్చారు. ఈ ఫన్నీ బాంటర్ డార్లింగ్ అభిమానులకు ఎంతో వినోదాన్ని అందిస్తోంది. ఎప్పుడూ కాస్త తక్కువ మాట్లాడే డార్లింగ్ ప్రభాస్ తో కొంచెం ఎక్కువ మాట్లాడించి అన్‌స్టాపబుల్ 2 షోని బాలకృష్ణ రక్తి కట్టించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: