రజినీకాంత్ జైలర్ లో కంప్లీట్ యాక్టర్?

Complete Actor To Do A Cameo Role In Rajinikanth Jailer Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Jailer,Jailer Movie,Jailer Telugu Movie,Jailer Update,Jailer Updates,Jailer Movie Updates,Jailer Movie Update,Jailer Movie Latest Updates,Jailer Movie Latest Update,Jailer Latest Update,Jailer Latest Updates,Jailer Telugu Movie Latest Updates,Jailer Movie News,Jailer Telugu Movie Latest News,Jailer Movie Latest News,Rajinikanth Jailer,Rajinikanth Jailer Movie,Rajinikanth,Rajinikanth Movies,Rajinikanth New Movie,Rajinikanth Latest Movie,Rajinikanth Upcoming Movie,Rajinikanth New Movie Update,Rajinikanth Latest Movie Update,Mohanlal And Rajinikanth To Share Screen Space For First Time,Mohanlal Cameo In Jailer,Mohanlal In Jailer,Mohanlal Cameo Role In Jailer,Mohanlal Role In Jailer,Mohanlal In Jailer Movie,Mohanlal To Play A Cameo Role In Rajinikanth's Jailer,Mohanlal Movie,Mohanlal Latest News,Mohanlal New Movie,Mohanlal Latest Movie,Rajinikanth And Mohanlal,Rajinikanth And Mohanlal Movie,Rajinikanth And Mohanlal New Movie

ఈమధ్య సినిమాల్లో అతిధి పాత్రలు కూడా సినిమాలపై ఎంత ఇంపాక్ట్ చూపిస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. అందుకే స్టార్ హీరోలు సైతం అతిథి పాత్రల్లో నటించడానికి ఏమాత్రం వెనుకాడట్లేదు. దానికి ఉదాహరణగా ఈమధ్యకాలంలో కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమాలో సూర్య నటించిన రోలెక్స్ పాత్ర గురించి చెప్పొచ్చు. కేవలం 10 నిమిషాలు మాత్రమే ఉండే ఈపాత్రకు ఎంత రెస్పాన్స్ వచ్చిందో చూశాం. ఇక ఇప్పుడు మరో సూపర్ స్టార్ సినిమాలో ఇంకో సూపర్ స్టార్ అతిథి పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే.. సూపర్ స్టార్ రజినీకాంత్నటిస్తున్న జైలర్ సినిమా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తున్న సినిమా జైలర్. రజనీకాంత్ కెరీర్ లో వస్తున్న 169 సినిమా ఇంది. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇటీవలే తలైవా బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా నుండి రజనీ క్యారెక్టర్‌ను పరిచయం చేస్తూ ఓ గ్లింప్స్‌ రిలీజ్‌ చేయగా అది కూడా ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఈసినిమాలో కంప్లీట్ యాక్టర్ మొహన్ లాల్ అతిథి పాత్రలో నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి వార్తలయితే వస్తున్నాయి. ఇదే కనుక నిజమయితే సినీ ప్రేక్షకులకు పండగే. మరిఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

కాగా కన్నడ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ, ప్రియాంక అరుళ్‌మోహన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా యోగిబాబు, వసంత్ రవి, వినాయకన్ కూడా ఈసినిమాలో నటిస్తున్నట్టు అధికారికంగా తెలియచేశారు. ఈ మూవీ కి సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించబోతున్నాడు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మించనున్నారు. ఇక ఈ చిత్రాన్ని ఈఏడాది ఏప్రిల్‌ 14న రిలీజ్‌ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 14 =