రీసెంట్ గానే గాడ్ ఫాదర్ సినిమాతో ఫామ్ లోకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. బాబీ దర్శకత్వంలో చిరు హీరోగా వస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య. ఈసినిమాను ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిస్తున్నాడు బాబీ. ఈసినిమాలో పాత చిరును చూస్తున్నట్టు ఉందన్న అభిప్రాయాలు ఇప్పటికే ఏర్పడిన సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ కూడా వింటేజ్ చిరును చూడటానికి ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా పాటలతోనే అంచనాలను పెంచేస్తున్నారు ఈసినిమాపై. గతంలో దేవి శ్రీ ప్రసాద్ చాలా చిరు సినిమాలకు పని చేశాడు. మంచి మంచి ఆల్బమ్స్ అందించారు. ఇక ఇప్పుడు కూడా ఈసినిమాకు సూపర్ హిట్ సాంగ్స్ ను అందిస్తున్నాడు. ఇప్పటివరకూ రిలీజ్ అయిన బాస్ పార్టీ అలానే టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు మరో మాస్ సాంగ్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్దమయ్యారు. తాజాగా పూనకాలు సాంగ్ రిలీజ్ అనే పాటను రిలీజ్ చేశారు. చిరంజీవి-రవితేజ ఇద్దరూ ఈపాటలో ఉండటంతో పాటపై ముందునుండే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఆ అంచనాలకు తగ్గట్టుగానే పూనకాలు తెప్పించేలా ఉంది ఈపాట. మాస్ సాంగ్, మాస్ బీట్, దానికి తగ్గట్టు చిరు-రవితేజ స్టెప్పులు ఉండటంతో పాట ఆకట్టుకుంటుంది.
This new year sing along the MEGA MASS SLOGAN, ‘Hey, Don’t stop Dancing, #PoonakaaluLoading ‘ 🕺🏾💥
Turn on your SPEAKERS now 😎
– https://t.co/L4RGtnwE6H#WaltairVeerayya
Mega ⭐ @KChiruTweets @RaviTeja_offl @dirbobby @shrutihaasan @ThisIsDSP pic.twitter.com/7nRFj44ySx— Mythri Movie Makers (@MythriOfficial) December 30, 2022
కాగా ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మాస్ మహారాజా రవితేజ ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈసినిమా సంక్రాంతి బరిలోకి దిగనుంది. జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.