యంగ్ హీరో నితిన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం నితిన్ రాబిన్ హుడ్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. భీష్మ తరువాత హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న సినిమా రాబిన్ హుడ్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ దక్కింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమాలో రాశీ ఖన్నా నటిస్తుందని.. శ్రీలీల ప్లేస్ లో రాశీ ఖన్నాను తీసుకున్నారని గత రెండు రోజులుగా వార్తలు జోరుగా వచ్చాయి. ఇక ఇప్పుడు ఈ వార్తలకు క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్ వెంకీ కుడుముల. రాబిన్ హుడ్ సినిమాలో నితిన్ సరసన రాశీఖన్నా నటిస్తుందంటూ వచ్చిన ట్వీట్ కు ఫేక్ న్యూస్ అంటూ రిప్లై ఇచ్చి రూమర్స్ కు చెక్ పెట్టారు.
#Robhinhood@actor_nithiin @RaashiKhanna @VenkyKudumula @MythriOfficial pic.twitter.com/KXix47jzX7
— Lucky shoyab (@324Syedshoyab) April 18, 2024
కాగా నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, ప్రవీణ్ పూడి ఎడిటర్ గా, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: