ఇండస్ట్రీలోకి వారసులు ఎంట్రీ ఇవ్వడం అనేది కామన్. ఇప్పటికే ఎంతోమంది వారసులు బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చూపిస్తున్నారు. ఇక ఇప్పుడు మరో సూపర్ స్టార్ తనయుడు కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అతను ఎవరో కాదు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్. మాములుగా అయితే హీరోల తనయులు మ్యాగ్జిమమ్ హీరోలుగా రావడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. చాలా తక్కువమంది మాత్రమే డిఫరెంట్ గా వెళతారు. ఇక్కడ ఆర్యన్ ఖాన్ కూడా హీరోగా రావడం లేదు.. దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక ఈవిషయాన్ని ఆర్యన్ కూడా స్వయంగా తెలియచేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్బంగా ఆర్యన్ తన ఇన్ట్సా ద్వారా రైటింగ్ కంప్లీట్ అయింది.. యాక్షన్ చెప్పడానికి వెయిట్ చేయలేకపోతున్నా అంటూ తెలిపాడు. ఈ ప్రాజెక్టు ఓ వెబ్ సిరీస్ అని తెలుస్తుంది. షారూక్ ఖాన్ సొంత నిర్మాణ సంస్థ అయిన రెడ్ ఛిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంతో కలిసి అమెజాన్ ఈ వెబ్ సిరీస్ ను నిర్మించనున్నారట. వచ్చే ఏడాది నుండి ఈ సిరీస్ చిత్రీకరణ మొదలవుతుందని సమాచారం.
View this post on Instagram
ఇక ప్రస్తుతం షారుఖ్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక సినిమాతో పాటు షారుఖ్ ప్రస్తుతం ‘జవాన్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుంది. వీటితో పాటుగా రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో ‘డంకీ’ చిత్రాన్ని చేస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: