యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర నుండి ఫస్ట్ సాంగ్ ఫియర్ రేపు విడుదలకానుందని తెలిసిందే.నిన్న రిలీజ్ చేసిన ఫియర్ సాంగ్ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియా ను షేక్ చేస్తుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఈప్రోమో ఫుల్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది.రేపటి నుండి ఈ సాంగ్ యూట్యూబ్ ను రూల్ చేస్తూ వ్యూస్ పరంగా ఈ సాంగ్ కొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది.ఇక ఈసాంగ్ రేపు రాత్రి 7:02 గంటలకు విడుదలకానుంది.అనిరుధ్ మ్యూజిక్ అందించగా రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలావుంటే ప్రస్తుతం చెన్నైలో సెకండ్ సాంగ్ రికార్డు కూడా జరుగుతుంది.షూటింగ్ విషయానికి వస్తే త్వరలోనే కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది.హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈసినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ లో కనిపించనున్నాడు.యువసుధ ఆర్ట్స్ ,ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.దేవర రెండు భాగాలుగా రానుండగా ఫస్ట్ పార్ట్ అక్టోబర్ 10న విడుదలకానుంది.
ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం ఈ సినిమా తోపాటు వార్ 2 లో కూడా నటిస్తున్నాడు.ఈ సినిమాతో తను హిందీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు.అయాన్ ముఖర్జీ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో యాష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈసినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























