బాబి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇక రీసెంట్ గా ఈసినిమా నుండి బాస్ పార్టీ అనే పాటను రిలీజ్ చేయగా ఆపాటకు సూపర్ రెస్పాన్స్ రావడం చూస్తున్నాం. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా రిలీజ్ పై గత కొద్దిరోజులుగా ఎంతో ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. ఎందుకంటే ఇప్పటికే చాలా సినిమా సంక్రాంతి బరిలో దిగనున్నాయి. దానికితోడు వీరసింహారెడ్డి రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించేశారు. జనవరి 12వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. దీంతో ఈసినిమా రిలీజ్ డేట్ ఎప్పుడుంటుందో అని ఎదురుచూస్తున్నారు. అంతేకాదు ఈసినిమా సోలో రిలీజ్ డేట్ కూడా ఉండే అవకాశం ఉందన్న వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్న రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన ఇచ్చారు మేకర్స్. ఫైనల్ గా ఈసినిమాను సంక్రాంతి బరిలోనే దించనున్నట్టు తెలిపారు. జనవరి 13వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
జనవరి 13 “మాస్ మూలవిరాట్”ఆగమనం 🔥🎯 #WaltairVeerayya #WaltairVeerayyaOnJan13th https://t.co/FtDWVC4TkS
— Bobby (@dirbobby) December 7, 2022
కాగా ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మాస్ మహారాజా రవితేజ ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను బాబి మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించబోతున్నాడు. ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: