2024 సెకండాఫ్ లో స్టార్ హీరోల జాతర

star heroes hungama in 2024 second half

ప్రతి ఏడూ ఎన్నో సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయి సందడి చేస్తుంటాయి. అయితే కొన్ని సీజన్లలో మాత్రం సినిమాల సందడి మరింత ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఏడాది ప్రారంభంలో వచ్చే సంక్రాంతి పండుగ. ఈపండుగకు పెద్ద పెద్ద సినిమాలు బరిలో దిగుతుంటాయి.. ఆ తరువాత ఫిబ్రవరి, మార్చిలో ఫ్లో కాస్త తగ్గినా సమ్మర్ కు మాత్రం మళ్లీ జోరు పెరుగుతుంది. ఇలా సీజన్ ను బట్టి సినిమాల రిలీజ్ కు ఉంటాయి. అయితే ఈ ఏడాది సంక్రాంతికి బాగానే రిలీజ్ అయినా.. సమ్మర్ సీజన్ మాత్రం కాస్త నిరాశ పరిచింది అని చెప్పొచ్చు. వెరసి ఫస్ట్ హాఫ్ లో అంతంత మాత్రంగానే సినిమాలు వచ్చాయి. ఇప్పుడు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంది సెకండాఫ్ గురించి. ఇక సెకండాఫ్ లో వచ్చే సినిమాలు కూడా మాములుగా లేవు. స్టార్ హీరోల సినిమాలతో పాటు మరికొంతమంది యంగ్ హీరోల సినిమాలు కూడా రిలీజ్ కానున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కల్కి 2898ఏడీ
సెకండాఫ్ లో ముందుగా రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కల్కి 2898ఏడీ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. సలార్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్లు కానీ, పలు గ్లింప్స్ కానీ ఈసినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. జూన్ 27వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

పుష్ప2
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుండి వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప2. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాకోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగష్ట్ 15వతేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దానికితోడు ఇప్పటివరకూ వచ్చిన అప్ డేట్లు అన్నీ సోషల్ మీడియాలో రికార్డులు క్రియేట్ చేశాయి. ఈసినిమా ఆగష్ట్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

దేవర
ఎన్టీఆర్ నుండి రాబోతున్న సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. రెండు పార్ట్ లుగా రాబోతున్న ఈసినిమాలో మొదటి పార్ట్ దసరా పండుగ సందర్భంగా ఆక్టోబర్ 10వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆర్ఆర్ఆర్ తరువాత ఇప్పటివరకూ ఎన్టీఆర్ నుండి కొత్త సినిమా రాలేదు. చాలా రోజుల తరువాత ఎన్టీఆర్ నుండి సినిమా వస్తుండటంతో ఈసినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూస్తున్నారు.

ఓజీ
సుజీత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రాబోతున్న సినిమా ఓజీ. ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను మొదలుపెట్టింది. ఇప్పటివరకూ చాలా వరకూ షూటింగ్ ను పూర్తిచేసుకుంది కూడా. సెప్టెంబర్ 27వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ కళ్యాణ్ ఒకపక్క రాజకీయాలతో బిజీగా ఉన్నా కూడా మరోపక్క చిత్రయూనిట్ మాత్రం మిగిలిన పోర్షన్స్ ను పూర్తి చేసుకుంటూ వెళుతున్నారు.

గేమ్ ఛేంజర్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ నటిస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. తమిళ డైరెక్టర్ శంకర్ దీన్ని పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు. అంతేకాకుండా శంకర్ ఓ తెలుగు హీరోతో స్ట్రైయిట్ సినిమా చేయడం కూడా ఇదే తొలిసారి కావడం విశేషం. ఈసినిమా రిలీజ్ డేట్ పై ఇంకా అధికారిక రాలేదు కానీ సెప్టెంబర్ లోనే సినిమా రిలీజ్ ఉంటుందని నిర్మాత దిల్ రాజు ఎప్పుడో క్లారిటీ ఇచ్చారు.

బాబీ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న సినిమా కూడా దసరాకే విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాగచైతన్య తండేల్ సినిమా కిస్మస్ పండుగ సందర్భంగా రిలీజ్ కానుంది. ఇంకా రజనీకాంత్ వెట్టైయాన్ తో పాటు పలు సినిమాలు లైన్ లో ఉన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.