కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

అల్లు శిరీష్ బడ్డీ నుండి ఫస్ట్ సింగిల్ అప్ డేట్

first single update from allu sirish buddy movie

అల్లు శిరీష్ బడ్డీ నుండి ఫస్ట్ సింగిల్ అప్ డేట్

First Single Update from Allu Sirish Buddy Movie

first single update from allu sirish buddy movie

బన్నీ తరువాత అల్లు ఫ్యామిలీ నుండి వచ్చిన మరో హీరో అల్లు శిరీష్. గౌరవం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు అల్లు శిరీష్. ఇక ఆ తరువాత నుండి పలు సినిమాలు చేస్తూ కెరీర్ ను కొననసాగిస్తున్నాడు. తన నుండి వచ్చిన చివరి సినిమా ఊర్వశివో..రాక్షసివో. ఆసినిమా తరువాత మరే సినిమాను ఇంతవరకూ రిలీజ్ చేయలేదు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా బడ్డీ. శామ్ ఆంటోన్ దర్శకత్వంలో ఈసినిమా రాబోతుంది.

ఈసినిమా నుండి అప్ డేట్ వచ్చి కూడా చాలా రోజులైపోయింది. అందరూ ఈసినిమా గురించి మర్చిపోతున్న తరుణంలో తాజాగా ఈసినిమా నుండి ఒక అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. ఆ పిల్ల కనులే అంటూ వచ్చే ఆపాటను రేపు అంటే మే15వ తేదీన ఈపాటను రిలీజ్ చేయనున్నారు.

కాగా ప్రిషా సింగ్ ఫీమేల్ లీడ్ లో నటిస్తుండగా.. తమిళ నటుడు అజ్మల్, అలీ ముఖేష్ రిషీ కూడా ఒక కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా హిప్ హాప్ తమీజా సంగీతం అందిస్తున్నాడు. ఆంటోని రూబెన్ ఎడిటర్ గా, క్రిష్ణన్ వసంత్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. మరి ఈసినిమాతో అయినా అల్లు శిరీష్ మళ్లీ ఫామ్ లోకి వస్తాడేమో చూద్దాం.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్