తెలంగాణ థియేటర్స్ యాజమాన్యం సంచలన నిర్ణయం

Single Screen Theatres to be Shut up to 10 Days in Telangana

తెలంగాణలో థియేటర్స్ మేనేజ్‌మెంట్ సంచలన నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుండి వచ్చే రెండు వారాల పాటు సింగిల్ స్క్రీన్ ధియేటర్లను మూసివేయనున్నారు. కాగా గత కొన్ని రోజులుగా ఒకవైపు ఐపీఎల్ జరుగుతుండటం.. అదేవిధంగా రాష్ట్రంలో ఎన్నికలు నేపథ్యంలో సాధారణ ప్రేక్షకులు సినిమాలకు రావడానికి అంతగా ఆసక్తి చూపించడంలేదు. దీనికితోడు ప్రస్తుతం కొత్త సినిమాలు, పెద్ద హీరోల చిత్రాలు కూడా ఏవీ విడుదల కాకపోవడంతో మూవీ లవర్స్ థియేటర్లకు రావడానికి ఇష్టపడటం లేదు. ఇలాంటి సమయంలో థియేటర్లు నడపటం ఆయా యాజమాన్యాలకు భారం అవుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీంతో రెండు వారాల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్‌లను మూసివేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తెలంగాణ థియేటర్స్ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది.కాగా తెలంగాణ రాష్ట్రంలో సుమారు 450 వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఉన్నట్లు సమాచారం. తెలంగాణ థియేటర్స్ యాజమాన్యం నిర్ణయంతో ఈ థియేటర్స్ అన్నీ రెండు వారాలపాటు మూతపడనున్నాయి. ఇదిలావుండగా.. మరోవైపు మల్టీప్లెక్స్‌లలో సైతం ప్రేక్షకుల సంఖ్య అంతంతమాత్రంగానే ఉంటున్నట్లు యాజమాన్యాలు చెబుతున్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.