ఆ క్లాసిక్ మూవీ రీమేక్ చేయాలని ఉంది

Talented Actor Satyadev Wants To Act In This Classic Remake, Satyadev Wants To Act In This Classic Remake, Talented Actor Satyadev, Actor Satyadev, Suhasini Maniratnam, Satyadev Kancharana, Tamanna Bhatia, Megha Akash, Kavya Shetty, Kala Bhairava, Nagashekar, Satyadev Latest Movie, Satyadev Upcoming Movie, Satyadev Movies, Gurthunda Seethakalam, Gurthunda Seethakalam 2022, Gurthunda Seethakalam Movie, Gurthunda Seethakalam Telugu Movie, Gurthunda Seethakalam Update, Gurthunda Seethakalam News, Gurthunda Seethakalam Latest News, Gurthunda Seethakalam New Update, Gurthunda Seethakalam Movie Live Updates, Gurthunda Seethakalam Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

టాలీవుడ్ లో టాలెంటెడ్ నటులు చాలా మందే ఉన్నారు. వారిలో సత్యదేవ్ పేరు ముందు వరుసలోనే ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తన నటనతో ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాందించుకున్నాడు సత్యదేవ్. పాత్ర ఏదైనా సరే.. ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసే సత్తా ఉన్న నటుడు. అందుకే ప్రస్తుతం కెరీర్ లో బిజీ అయిపోయాడు. ఒక పక్కహీరో పాత్రలు చేస్తూనే మరోపక్క పలు సినిమాల్లో కీలక పాత్రలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈనేపథ్యంలోనే ఇటీవల గాడ్ ఫాదర్ లో తను ఒక కీలక పాత్రలో నటించగా ఆ పాత్రకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూశాం. ఇక ఇప్పుడు హీరోగా వస్తున్న గుర్తుందా శీతాకాలం సినిమా రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సత్యదేవ్ హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా వస్తున్న సినిమా గుర్తుందా శీతాకాలం. ఈసినిమా కన్నడ సూపర్ హిట్ మూవీ లవ్ మాక్ టైల్ సినిమాకు ఈసినిమా రీమేక్ అన్న సంగతి కూడా తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని దర్శకుడు నాగశేఖర్ తెరెక్కిస్తుండగా, ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్, ట్రైలర్లు ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. ఈసినిమా డిసెంబర్ 9వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఇక సత్యదేవ్ కూడా వీలైనంత వరకూ ఈసినిమా ప్రమోషన్స్ ను చేస్తున్నాడు. దీనిలో భాగంగానే తాజాగా తన ట్విట్టర్ ద్వారా క్వశ్చన్ అండ్ ఆన్సర్ ను నిర్వహించాడు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ తనను తన డ్రీమ్ రోల్ గురించి అడుగగా.. తనకు చిరంజీవి నటించిన చంటబ్బాయి సినిమాను రీమేక్ చేయాలని ఉందని తెలిపాడు. మరి చూద్దాం ఫ్యూచర్ లో ఏమైనా రీమేక్ చేసే అవకాశం ఉంటుందేమో.. సత్యదేవ్ కోరిక తీరుతుందేమో..

ఇంకా ఈ సినిమాలో మేఘా ఆకాష్, కావ్య‌శెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నాగ శేఖర్ మూవీస్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ సినిమాను నాగశేఖర్, భావన రవి నిర్మిస్తున్నారు. కీరవాణి తనయుడు కాల భైరవ సంగీతాన్ని అందిస్తుండగా.. సత్య హెగ్డే సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 9 =