వెంకట్ ప్రభు దర్శకత్వంలో దళపతి విజయ్ హీరోగా వస్తున్న సినిమా గోట్. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇక మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ ఇప్పటికే మొదలుపెట్టిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే విజిల్ పోడు అనే పాటను రిలీజ్ చేయగా.. ఆపాటకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూస్తున్నాం. రెండో పాటను జూన్ లో రిలీజ్ చేయనున్నారు. ఈసినిమాను సెప్టెంబర్ 5వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు రీసెంట్ గానే ప్రకటించారు చిత్రబృందం. ఇప్పుడు ఈసినిమా నుండి మరో క్రేజీ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టినట్టు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా సినిమాలో విజయ్ కు జోడీగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా స్నేహ, ప్రశాంత్, ప్రభుదేవా, జైరాం, లైలా, కమెడియన్, అజ్మల్, యోగిబాబు, వైభవ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అర్చన కల్పతి నిర్మిస్తున్నారు. యువన్‌శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























