టాలీవుడ్‌కు రెండు కళ్ళు అనదగ్గవారిలో ఒకరు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) కాగా.. మరొకరు అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్). ఈ ఇద్దరు అగ్ర హీరోలు అన్ని రకాల పాత్రలు పోషించినప్పటికీ ఎన్టీఆర్ మాస్ హీరోగా పేరు తెచ్చుకోగా, ఏఎన్నార్ ఫ్యామిలీ హీరోగా గుర్తింపు పొందారు. వీరిలో ఎన్టీఆర్ 1995లోనే తనువు చలించగా, ఏఎన్నార్ 2014లో పరమపదించారు. తుదిశ్వాస విడిచేవరకూ ఏఎన్నార్ సినిమాలలో నటించడం విశేషం. ఈ క్రమంలో ఆయన నటించిన చివరి చిత్రం ‘మనం’. ఈ సినిమా ఆయనకే కాకుండా అక్కినేని ఫ్యామిలీకి ఎంతో ప్రత్యేకం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మనం చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావుతో పాటు ఆయన తనయుడు నాగార్జున మరియు మనవళ్ళు నాగచైతన్య, అఖిల్.. ఇలా మూడు తరాల హీరోలు కలిసి నటించడం విశేషం. ఇలా కుటుంబ హీరోలు అందరూ నటించిన ఈ చిత్రం వారి కుటుంబానికి ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే అక్కినేని అభిమానులు కూడా ఈ మూవీని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ఈ చిత్రంలో నాగార్జున సతీమణి అమల మరియు నాగచైతన్య మాజీ భార్య, స్టార్ హీరోయిన్ సమంత కూడా నటించడం గమనార్హం.
ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ సినిమాకు కోలీవుడ్ డైరెక్టర్ విక్రమ్ కే కుమర్ దర్శకత్వం వహించగా 2014 మే 23న రిలీజై ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమా విడుదలై 10 సంవత్సరాలు కావస్తోంది. ఈ సందర్భంగా మే 23న మనం చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు విషయాన్ని అక్కినేని ఫ్యామిలీ సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. వ తేదీన విడుదల చేయనుందామని తెలియజేశారు సినిమా యూనిట్. దీంతో అక్కినేని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి ఈ సినిమాని థియేటర్స్ లో చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































