ఈమధ్య కాలంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలపైనే ఎక్కువ దృష్టి సారించింది కంగనా. ఝాన్సీ లక్ష్మీభాయి, తలైవి ఇలా పవర్ ఫుల్ పాత్రల్లో నటించి మంచి ప్రశంసలే దక్కించుకుంది. ఇప్పుడు మరో పవర్ ఫుల్ లేడీ పాత్రలో కనిపించనుంది. కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఎమర్జెన్సీ. అత్యంత శక్తివంతమైన మహిళా ప్రధానిగా పేరు తెచ్చుకున్న ఇందిరా గాంధీ పాత్రలో ఈసినిమాలో నటిస్తుంది. ఎమర్జెన్సీ సమయంలో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్ గా జూన్ 14వ రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ రిలీజ్ డేట్ ను వాయిదా వేస్తున్నాారు. ఈవిషయాన్ని చిత్రయూనిట్ తెలియచేసింది. కంగనా ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఆమె దేశ సేవకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.. అందుకే ఎమర్జెన్సీ పనులకు దూరంగా ఉన్నారు.. ఈ కారణం చేత రిలీజ్ డేట్ ను వాయిదా వేస్తున్నాం.. కొత్త రిలీజ్ డేట్ ను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.
View this post on Instagram
కాగా ఈసినిమాకు నిర్మాతగా కూడా కంగనానే వ్యవహరిస్తుంది. మణికర్ణిక ఫిలింస్ బ్యానర్ పై కంగనా ఈసినిమాను నిర్మిస్తుంది. ఇంకా ఈసినిమాలో అనుపమ్ ఖేర్, శ్రేయ తల్పాడే, సతీష్ కౌషిక్, మహిమా చౌదరి, మిలింద్ సోమన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































