రామ్ –పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న మచ్ అవైటెడ్ సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్.రామ్ బర్త్ డే సందర్భంగా మూడు రోజుల క్రితం ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.తెలుగు తోపాటు ఇతర భాషల్లో రిలీజైన ఈ టీజర్ 100మిలియన్ల కుపైగా డిజిటల్ ఇంప్రెషన్స్ ను సొంతం చేసుకుంది. ఇక తెలుగు వెర్షన్ అయితే యూట్యూబ్ లో 10మిలియన్లకు పైగా వ్యూస్ తో రెండో స్థానం లో ట్రెండింగ్ లో కొనసాగుతుంది. ఫస్ట్ పార్ట్ కుమించి ఈ సీక్వెల్ వుండనుందని టీజర్ తో హింట్ ఇచ్చారు.రామ్ ఎనర్జీ , డైలాగ్స్ వీటికి తోడు మణిశర్మ మ్యూజిక్ టీజర్ లో హైలైట్ అయ్యాయి.ఓవరాల్ గా టీజర్ తో హైప్ డబుల్ చేయడం లో టీం సక్సెస్ అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబై లో జరుగుతుంది.వచ్చే నెలలో షూటింగ్ మొత్తం పూర్తి చేసి ఆగస్టు లో విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.కావ్య థాపర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుండగా ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ రోల్ లో కనిపించనున్నాడు.పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ ,ఛార్మి ఈసినిమాను నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























