నటసింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న సినిమా వీరసింహారెడ్డి. ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు గోపీచంద్ మలినేని. అంతేకాదు ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న గెటప్స్‌లో నటిస్తూ ప్రేక్షకులను మరోసారి తనదైన పర్ఫార్మెన్స్‌తో అలరించేందుకు రెడీ అయినట్టు తెలుస్తుంది. ఇన్ని రోజులు ఈసినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తామని తెలుపుతూ వస్తున్నారు చిత్రయూనిట్. ఈనేపథ్యంలోనే ఈసినిమాను సంక్రాంతికే రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫామ్ చేస్తూ డేట్ ను కూడా ప్రకటించారు. జనవరి 12వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక ఇన్ని రోజులు ఈసినిమా షూటింగ్ తో బజీగా ఉంది. ఇక్కడ విదేశాల్లో కంటిన్యూగా షూటింగ్ ను జరుపుకొని ఫైనల్ గా షూటింగ్ ను పూర్తి చేశారు. టాకీ పార్ట్ మొత్తం పూర్తిచేసుకొని ఇంకా ఒక్క పాట మాత్రమే పెండింగ్ లో ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో బాలయ్యకు విలన్ గా కన్నడ విలక్షణ నటుడు దునియా విజయ్ నటించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన్సర్ పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ కలిసి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు సినిమాటోగ్రఫి రిషి పంజాబీ అందిస్తున్నాడు. సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: