మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. పుష్ప :ది రైజ్ మూవీ హిందీ వెర్షన్ 100కోట్ల క్లబ్ లో చేరింది.ఈ మూవీ తో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.పుష్ప మూవీ సెకండ్ పార్ట్ పుష్ప :ది రూల్ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బ్లాక్ బస్టర్ పుష్ప:ది రైజ్ మూవీ రష్యాలో డిసెంబర్ 8 వ తేదీ రిలీజ్ కానుంది.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక, సుకుమార్ ఇతర చిత్ర యూనిట్ రష్యాలోని మాస్కోలో ఈ మూవీ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.చిత్ర యూనిట్ సభ్యులు అల్లు అర్జున్.. సుకుమార్.. రష్మిక మందన్నా.. దేవిశ్రీ ప్రసాద్ ఇంకా నిర్మాతలు రష్యాలో ప్రమోషన్ కార్యక్రమాల్లో తగ్గేదేలే అంటూ బిజీగా ఉన్నారు. అక్కడి మీడియాతో మాట్లాడుతూ తమ సినిమాను భారీగా ప్రమోట్ చేసుకుంటున్నారు. .పెద్ద ఎత్తున రష్యాలో తిరుగుతూ సందడి చేస్తున్న పుష్ప యూనిట్ సభ్యులు స్థానికుల్లో సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. మీడియాలో మంచి కవరేజ్ ను దక్కించుకుటున్నారు. స్థానికంగా రైలు ప్రయాణం చేస్తూ రకరకాలుగా ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అయ్యేందుకు పుష్ప టీమ్ ప్రయత్నాలు చేస్తున్నారు.ఎన్నారై ఫ్యాన్స్ తో పాటు రష్యన్స్ కూడా పుష్ప సినిమాను చూసేందుకు మరియు పుష్ప యూనిట్ సభ్యులతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడుతున్నారు. రష్యాలో ఈ సినిమా సక్సెస్ అయితే పుష్ప 2 అంతకు మించి అక్కడ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: