మసూద మూవీ రివ్యూ.. ఇంట్రెస్టింగ్ హార్రర్ మూవీ

Kavya Kalyanram, Masooda, Masooda (2022) – Movie, Masooda (film), Masooda 2022, Masooda Critics Review, Masooda First Review, Masooda Movie, Masooda Movie – Telugu, Masooda Movie (2022), Masooda Movie Highlights, Masooda Movie Plus Points, Masooda Movie Public Response, Masooda Movie Public Talk, Masooda Movie Review, Masooda Movie Review And Rating, Masooda Movie Updates, Masooda Review, Masooda Story review, Masooda Telugu Movie Latest News, Masooda Telugu Movie Live Updates, Masooda Telugu Movie Review, Masooda Telugu Review, Nagesh Banell, Prashanth R Vihari, Rahul Yadav Nakka, Sai Kiran, sangitha, Thiruveer

సాయికిరణ్ దర్శకుడిగా పరిచయం అవుతూ తిరువీర్, కావ్య క‌ల్యాణ్‌రామ్ జంటగా వస్తున్న హార్రర్ సినిమా మసూద. ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. అందులోనూ ‘మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విజయవంతమైన బ్లాక్‌బస్టర్‌ చిత్రాల తర్వాత స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఆ అంచనాల మధ్య నేడు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంది.. హిట్ అయిందే లేదా అన్నది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు.. తిరువీర్, కావ్య క‌ల్యాణ్‌రామ్, సంగీత, శుభలేఖ సుధాకర్, సత్యం రాజేష్, అఖిలా రామ్, సత్య ప్రకాష్ తదితరులు..
దర్శకత్వం.. సాయికిరణ్
బ్యానర్స్.. స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌
నిర్మాతలు.. రాహుల్ యాదవ్
సినిమాటోగ్రఫి.. నగేష్ బానెల్
సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి

కథ..

నీలం (సంగీత) ఓ సైన్స్ టీచర్ గా పనిచేస్తుంది. తన భర్త నుండి విడాకులు తీసుకున్న ఆమె తన కూతురు నాజియా (బాంధవి శ్రీధర్) తో పాటు నివసిస్తుంటుంది. ఇక మరోవైపు అదే అపార్ట్‌మెంట్‌లో గోపికృష్ణ (తిరువీర్) అనే సాఫ్ట్ వేర్ వుద్యోగి ఉంటాడు. గోపి తన ఆఫీసులో పనిచేసే మినీ (కావ్యా కళ్యాణ్ రామ్) అనే అమ్మాయి అంటే ఇష్టపడతాడు. అలా సాగిపోతున్న సమయంలో అనుకోకుండా నాజియా వింతగా ప్రవర్తిస్తుంటుంది. అప్పుడు ఆ కుటుంబానికి తోడుగా ఉంటాడు గోపీ. దయ్యం పట్టి ఉంటుందన్న అనుమానంతో ఆమెను కాపాడేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈక్రమంలో గోపీకి ఎదురైన ఘటనలు ఏంటి? మినీతో ప్రేమ వ్యవహారం ఏమవుతుంది?నీలం తన కూతురిని రక్షించుకుంటుందా? నాజియాకు దెయ్యం ఎందుకు పట్టింది? అసలు మసూద ఎవరు? మసూద నేపథ్యం ఏంటి? అన్నది తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ..

ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ డైరెక్టర్స్ తమ సత్తాను చాటుకుంటున్నారు. విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ వారిని అలరిస్తున్నారు. ఒక్క సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు. అందుకే పెద్ద డైరెక్టర్ చిన్న డైరెక్టర్ అన్న తేడా లేకుండా అగ్రహీరోల దగ్గర నుండి స్టార్ హీరోల వరకూ అందరూ ఛాన్స్ లు ఇస్తున్నారు. ఇక ఇప్పుడు తమ మొదటి సినిమాతోనే అందరినీ ఆకట్టుంటున్నాడు సాయి కిరణ్. సాయి కిరణ్ దర్శకత్వంలో వచ్చిన మసూద సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హార్రర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమాకు పాజిటివ్ టాక్ వస్తుంది.

హార్రర్ సబ్జెక్ట్‌ను డీల్ చేయడం అంత తేలికకాదు. హార్రర్ సినిమాలను సినిమా ప్రారంభం నుండి చివరి వరకూ ప్రేక్షకులను ఎంగేజ్ చేసే విధంగా ఉండాలి. మసూద విషయంలో దర్శకుడు తను అనుకున్న కథను చివరకు సస్పెన్స్ చేయడంలో సక్సెస్ సాధించాడు. సినిమా ప్రారంభం నుంచి ఎండ్ కార్డ్ వరకు ప్రేక్షకులను కథలో కనెక్ట్ చేయడంతో సక్సెస్ అయ్యాడు. కథ పాతదే అయినా సాయి కిరణ్ దాన్ని రాసుకున్న నేపథ్యం, తీసిన తీరు మాత్రం కొత్తగా అనిపిస్తుంది.

పెర్ఫామెన్స్

ఈసినిమాలో గోపీ పాత్రలో నటించిన తిరువీర్ చాలా బాగా నటించాడు. గతంలో తను చేసిన పాత్రలకు ఈపాత్ర కాస్త విభిన్నంగా ఉంది అని చెప్పచ్చు. భయస్తుడు, మొహమాటస్తుడిగా తిరు బాగా నటించడమే కాకుండా ఆపాత్రకు సరిగ్గా సెట్ అయ్యాడు. ఇక నాజియా పాత్రలో నటించిన బాంధవి మాత్రం నిజంగానే భయపెట్టేసింది. ఈ సినిమా అంతా కూడా ఆమె చుట్టూనే నడిచింది. ఇక సంగీత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన సీనియారిటీని చూపించింది. ఇక ఎమోషనల్ సీన్స్‌లో కన్నీరు పెట్టించేసింది. కావ్యా కళ్యాణ్‌ రామ్‌ కూడా కనిపించినంత సేపు అందంగా అనిపిస్తుంది. మిగిలిన పాత్రల్లో సత్యం రాజేష్‌, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్‌ తమ పాత్ర మేర నటించారు.

టెక్నికల్ వాల్యూస్

ఇలాంటి హార్రర్ సినిమాలకు సినిమాటోగ్రఫి అలానే సంగీతం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా సంగీతం చాలా ముఖ్యం. ఈ సినిమాకి ప్రశాంత్ విహారి చాలా బాగా సంగీతం అందించాడు. సన్నివేశాలు ఆసక్తికరంగా రావటానికి ప్రశాంత్ అందించిన సంగీతం కూడా బాగా దోహద పడింది. ఈ సినిమాకు కెమెరామెన్‌గా పనిచేసిన నగేష్ బానెల్ ప్రతి సన్నివేశాన్ని అందంగా తెరపై చూపించాడు. నైట్ విజువల్స్, హ్రార్రర్ సన్నివేశాలు బాగున్నాయి. కెమెరా, మ్యూజిక్ ఈ రెండింటిని సాయి కిరణ్ బాగా వాడుకున్నాడు. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.

ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా ఖచ్చితంగా భయపెడుతుందని చెప్పొచ్చు. హార్రర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈసినిమా నచ్చుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here