ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్స్ పై మెహెర్ రమేశ్ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , తమన్నా జంటగా అన్నా చెల్లెళ్ళ నేపథ్యంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ మూవీ 2023 ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. సూపర్ హిట్ వేదాళంతమిళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేశ్ నటిస్తున్నారు. మురళీశర్మ , రావు రమేష్ , రఘుబాబు, వెన్నెల కిషోర్, రష్మీ , శ్రీముఖి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సాగర్ మహతి సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సన్ పిక్చర్స్ బ్యానర్ పై సూపర్ హిట్ డాక్టర్, బీస్ట్ మూవీస్ ఫేమ్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ జైలర్ తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ 2023 ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ కానున్నాయి. ఈ మూవీ లో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. సీనియర్ హీరోయిన్ తమన్నా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. హీరో రజనీకాంత్ డ్యూయల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో నటిస్తున్న ఈ మూవీ ని రెండు భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ప్లాన్ చేస్తోంది.హీరో చిరంజీవి , రజనీకాంత్ లకు అభిమానులు అధిక సంఖ్య లో ఉన్న విషయంతెలిసిందే . జైలర్, భోళాశంకర్ రెండు సినిమాలు ఒకేరోజు రిలీజ్ కావడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: