జాతి రత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకి హీరోయిన్ గా పరిచయం అయింది ఫరియ అబ్దుల్లా. మొదటి సినిమాలోనేతన న్యాచురల్ యాక్టింగ్ తో అందరినీ ఫిదా చేసేసింది. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయి మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో ఫరియా కు కూడా అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఇక లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సంతోష్ శోభన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం తను లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ సినిమాతో బిజీగా ఉంది. ఈసినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫరియా అబ్దుల్లా జాతి రత్నాలు సినిమాలో చిట్టీ పాత్రను అందరూ అభిమానించారు.. ఈ విషయంలో ఆనందంతో పాటు బాధ్యత కూడా పెరిగింది. ఇప్పుడు లైక్, షేర్ అండ్ సబ్ స్క్రైబ్ సినిమాలో నేను చేసిన వసుధ పాత్ర మాత్రమే కనిపిస్తుంది అంటూ తెలిపింది. అంతేకాదు.. నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం.. ఈసినిమాలో నేను ట్రావెల్ వ్లాగర్ గా కనిపిస్తాను.. ఈసినిమా వల్లే నేను ఫస్ట్ విదేశీ ప్రయాణం చేశాను.. నేను ఎప్పటికీ మరిచిపోలేను.. జాతిరత్నాలు సినిమాలాగే ఈసినిమా కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది… మరో ఐదేళ్లలో పాన్ వరల్డ్ స్థాయిలో నాకు మంచి గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను.. నాకు డైరెక్షన్ పై ఆసక్తి ఉంది.. అందుకు మరో ఐదేళ్లు పడుతుంది అంటూ తెలిపాడు.
కాగా ఈసినిమాలో హీరోయిన్ గా జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా నటిస్తుంది. ఇంకా ఈ చిత్రంలో బ్రహ్మాజీ, సుదర్శన్, సప్తగిరి, మైమ్ గోపి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నిహారికా ఎంటర్‌టైన్ మెంట్-ఆముక్త క్రియేషన్స్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 4న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: