వైజయంతీ మూవీస్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ చరణ్ , నేహశర్మ జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ చిరుత మూవీ 2007 సెప్టెంబర్ 28 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి 40 సెంటర్స్ లో శతదినోత్సవం జరుపుకుంది. మొదటి చిత్రమైనా హీరో రామ్ చరణ్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని తండ్రి (మెగా స్టార్ చిరంజీవి ) కి తగ్గ తనయుడిగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ 2 వ మూవీ గా తెరకెక్కిన ఫాంటసీ , యాక్షన్ మూవీ మగధీర ఘనవిజయం సాధించి 150 కోట్ల క్లబ్ లో చేరింది. 1000 రోజుల థియేట్రికల్ రన్ తో మగధీర మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ రామ్ చరణ్ లో ద్విపాత్రాభినయం చేయడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా తెరకెక్కిన రచ్చ , నాయక్ , ఎవడు , ధృవ , రంగస్థలం మూవీస్ ఘనవిజయం సాధించాయి. చిరుత మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన రామ్ చరణ్ బెస్ట్ యాక్టర్ గా నంది , ఫిల్మ్ అవార్డ్స్ అందుకున్నారు. మగధీర మూవీ కి రామ్ చరణ్ బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ , రంగస్థలం మూవీ కి సైమా అవార్డ్ అందుకున్నారు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ లో అల్లూరి సీతారామరాజుగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి రామ్ చరణ్ ప్రేక్షకులతో పాటు , విమర్శకుల ,సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. హీరో రామ్ చరణ్ ప్రస్తుతం భారీ చిత్ర దర్శకుడు శంకర్ ఎస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న #RC15 మూవీ లో నటిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 15 సంవత్సరాల సినీ జర్నీ ని దిగ్విజయంగా కంప్లీట్ చేసుకున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: