జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు మాస్ మహారాజా రవితేజ. ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు రవితేజ. ప్రథమార్థంలో ఖిలాడి సినిమా రిలీజ్ అవ్వగా.. ఇటీవలే రామారావు ఆన్ డ్యూటీ సినిమాను రిలీజ్ చేయగా రెండు సినిమాలు కూడా సరైన విజయాన్ని అందించలేకపోయాయి. ఇక ప్రస్తుతం అయితే తన కొత్త సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అందులో టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా ఒకటి. వంశీ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈసినిమా స్టూవర్ట్ పురం దొంగగా పేరుగాంచిన ‘టైగర్ నాగేశ్వరరావు’ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న సంగతి కూడా విదితమే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఈ సినిమాలో పాత్రపై రేణు ఇంట్రస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ఈసినిమాలో సామాజికవేత్త, రచయిత హేమలత లవణం గారి పాత్రలో రేణు దేశాయ్ నటిస్తుంది. ఇక తాజాగా రేణూ దేశాయ్ షూటింగ్ ను మొదలుపెట్టినట్టుంది. ఈనేపథ్యంలో తన ఇన్‌స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది. “హేమలత లవణం గారి వంటి స్ఫూర్తిదాయకమైన పాత్రలో నేను బాగుంటాను అని నన్ను నమ్మినందుకు డైరెక్టర్ వంశీకృష్ణకు కృతజ్ఞతలు” అని చెప్పుకొచ్చింది. తన సన్నివేశాల స్క్రిప్ట్‌ను కూడా పోస్ట్ చేసింది.
ఇక ఈసినిమా ఇండియన్ రాబిడ్ హుడ్‌గా పిలవబడే గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ అధారంగా తెరకెక్కనుంది. 1970-1980 దశకాల్లో నాగేశ్వరరావు ఆంధ్ర ప్రదేశ్‌లో భారీ ఎత్తున దొంగతనాలు, దోపిడీలు చేస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకునే వాడు. ఇలాంటి గజదొంగ కథ బయోపిక్‌గా తెరకెక్కుతుండటంతో ఈసినిమాపై అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. మరి చూద్దాం ఈసినిమా ఎలా ఉండబోతుందో..
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: