ఒక మనసు చిత్రంతో వెండితెర ఆరంగేట్రం చేసిననిహారిక ఆసినిమాలో తన నటనతో మంచి పేరే సంపాదించుకుంది. ఆ తరువాత హ్యాపీ వెడ్డింగ్, ప్రణీత్ దర్శకత్వంలో సూర్యకాంతం, తమిళ్ లో ఒక సినిమా చేసింది. ఈ రెండు సినిమాలు కూడా నిహారికకు విజయం అందించలేకపోయాయి. అయితే సూర్యకాంతం సినిమాలో నిహారిక నటనకు మాత్రం అందరూ ఫిదా అయిపోయారు. ఇక ఆ సినిమా తర్వాత ఇప్పటి వరకూ మరే సినిమా చేయలేదు. ఇక వివాహబంధంలోకి అడుగుపెట్టేయడంతో సినిమాలకు మరింత దూరమైనట్టే. ప్రస్తుతం అయితే నిర్మాతగా మారి పలు వెబ్ సిరీస్ లు అంటూ.. పలు ప్రాజెక్ట్ లను ప్రేక్షకులకు అందిస్తున్నారు
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నిహారిక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన ఫొటోలతో సందడి చేస్తూనే ఉంటుంది. కానీ ఈసారి పోస్ట్ చేసిన ఫొటోలు మాత్రం వైరల్ గా మారాయి. దానికి కారణం నిహారిక వేసిన గెటప్పే. తాజాగా ఓ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న నిహారిక గంగూబాయి కతియావాడి సినిమాలో అలియా భట్ వేసిన గెటప్ ను నిహారిక వేసింది. ఆసినిమాలో అలియాభట్ ఎలా చేసిందో అలాంటి హావభావాలను నిహారిక కూడా పలికించింది. ఇక ఈఫొటోలను, వీడియోలను తన ఇన్స్టా గ్రామ్ లో పోస్ట్ చేయడంతో అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఫ్యాన్స్ వాటికి లైక్స్ కొడుతూ, షేర్ చేస్తున్నారు.
కాగా అలియా భట్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా గంగూబాయ్ కతియావాడి. కామతిపురలో వేశ్య వృత్తి నుంచి గ్యాంగ్‌స్టర్‌గా, అట్నుంచి పొలిటికల్ లీడర్‌గా ఎదిగిన గాంగూబాయ్ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈసినిమా ఈ ఏడాది ప్రారంభంలో విడుదలై మంచి విజయం సాధించింది. ఇక ఈసినిమాలో గంగూబాయ్‌గా నటించిన అలియాభట్ కు కూడా మంచి ప్రశంసలు దక్కాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: