బిగ్ బాస్6 డే2 హైలెట్స్

Bigg Boss Telugu 6 Day 2 Highlights, Bigg Boss Telugu Season 6 Day 2 Highlights, Bigg Boss Season 6 Day 2 Highlights, Bigg Boss Day 2 Highlights, Bigg Boss Highlights, Bigg Boss Telugu Season 6, Bigg Boss Telugu Season 6 Contestants List, Bigg Boss Telugu Season 6 Contestants Profiles, Bigg Boss Season 6, Bigg Boss Telugu Season 6 Contestants Names, Bigg Boss Telugu, Bigg Boss Season 6 Contestants List, Bigg Boss Telugu Season 6 Contestants Names, Bigg Boss Telugu 6, Bigg Boss, Bigg Boss 6 telugu starting date and time, Bigg Boss 6, Bigg Boss Season 6 Launch, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News,

బిగ్ బాస్ 6.. ఈ సీజన్ లో రెండో రోజు కూడా పూర్తయిపోయింది. మొదటి రోజు బిగ్ బాస్ ఇచ్చిన క్లాస్-మాస్-ట్రాష్ రెండో రోజు కూడా కొనసాగింది. మరోవైపు కంటెస్టెంట్స్ ఎవరి డిస్కషన్స్ లో వారు ఉంటారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రేవంత్ కు సలహాలు
సూర్యతోనే ఎక్కువగా ఉంటున్నాను అని రేవంత్ నన్ను ట్రాష్‌లోకి వేసేశాడు అని ఆరోహి ఇతర కంటెస్టెంట్స్ తో చెబుతుంటే మరోవైపు.. ఇదే విషయంపై రేవంత్‌కు అర్జున్ కాస్త సలహాలు ఇచ్చాడు. అలాంటి రీజన్లు చెబితే నువ్వే బ్యాడ్ అవుతావు అంటూ సలహా ఇచ్చాడు. అయితే రేవంత్ మాత్రం నేను జెన్యూన్ కాదంటే జనాలే ఎలిమినేట్ చేస్తారు అంటూ సమాధానమిచ్చాడు. ఈవిషయంపైనే అర్జున్ వాసంతి తో కూడా డిస్కస్ చేస్తాడు. నేను ఎంత చెప్పినా రేవంత్ వినడంలేదని చెప్పుకొచ్చాడు. మరోవైపు గీతు కూడా మీ గురించి అందరూ నెగిటివ్ గా మాట్లాడుకుంటున్నారు… మాట్లాడేముందు ఓ పదిసెకన్లు ఆగి మాట్లాడండి.. మీ మంచికే చెబుతున్నా.. అంటూ రేవంత్ కు చెబుతుంది.

బిగ్ స్విచ్
ఈ రౌండ్ లో క్లాస్ టు ట్రాష్.. ట్రాష్ టు క్లాస్ చేంజ్ చేసుకునే అవకాశాన్ని బిగ్ బాస్ ఇచ్చాడు. వారి వారి గ్రూపులు ఆ సభ్యుడిని ఏకాభిప్రాయంతో ఎంచుకోవాలని చెప్పాడు. దీంతో ట్రాష్‌లో ఉన్న ఇనయ, గీతు, రేవంత్‌లు చర్చించుకున్నారు. ఇనయ అప్పటికే కొబ్బరిబోండాల టాస్క్ ఆడింది కాబట్టి.. ఈ సారి గీతూ, రేవంత్‌ మేము ఆడతామని చెప్పారు. ఇనయ తప్పుకోగా రేవంత్-గీతు ఇద్దరూ చాలా సేపు డిస్కస్ చేసుకుంటారు.. ఇద్దరూ తమకు ఓపిక లేదని.. ఫుడ్ కూడా లేదని పలు కారణాలు చెప్పుకున్నారు. ఇక గీతు మీరు అయితే నెక్ట్స్ ఏ టాస్క్‌లు వచ్చినా చేస్తారు.. మీరు స్ట్రాంగ్ అని చెప్పి రేవంత్ ను కన్విన్స్ చేయడంతో రేవంత్ కూడా చేసేది లేక ఓప్పుకున్నాడు.

మరోవైపు క్లాస్ టీమ్ లో ఉన్న బాలాదిత్య ట్రాష్‌లోకి రావడానికి ఒప్పుకోవడంతో. గీతు క్లాస్‌ టీమ్ లోకి.. బాలాదిత్య ట్రాష్ టీమ్ లోకి స్వాప్ అవుతారు. ఇక క్లాస్ టీమ్ వారికి కంటెస్టెంట్ లతో పనులు చేయించుకునే అధికారం ఉంది కాబట్టి గీతు.. ఆరోహి, ఇనయలతో ఆడుకుంది. ఇష్టమొచ్చిన పనులు చేయించుకుంది. ఇదిలా జరుగుతుండగా.. రేవంత్ కాస్త ఎమోషనల్ అవుతాడు. బాత్ రూం లో ఏడుస్తుండగా.. ఇది నీకు తరువాత ఎప్పుడైనా పనికొస్తుంది.. నీకు మంచి పేరు వస్తుందంటూ అర్జున్, చంటి, బాలాదిత్య, కీర్తి ఓదార్చారు.

స్లైడ్ జరా స్లైడ్ జరా
ఆతరువాత స్లైడ్ జరా స్లైడ్ జరా అనే టాస్క్‌ ఇచ్చాడు బిగ్ బాస్.. ఈ రౌండ్ లో ట్రాష్ నుండి మాస్ టీమ్ నుండి ఒకరు రావాలి. ఇక ట్రాష్ టీమ్ నుండి రేవంత్, మాస్ టీమ్ నుండి అభినయ శ్రీ రాగా రేవంత్ చేతిలో అభినయ ఓడిపోయింది. టాస్క్ ఓడటంతో అభినయ ట్రాష్‌ లోకి వచ్చింది. రేవంత్ ట్రాష్ నుంచి మాస్‌లోకి వెళ్లిపోయాడు.

రోల్ బేబీ రోల్
బిగ్ బాస్ మూడో ఛాలెంజ్ లో భాగంగా రోల్ బేబీ రోల్ అనే టాస్క్ ఇచ్చాడు. మూడో చాలెంజ్‌ కోసం మాస్ నుండి నేహా ట్రాష్ నుండి ఇనయ పాల్గొంటారు. అయితే ఈ టాస్క్ లో ఇనయ ఓడిపోవడం జరుగుతుంది. దీంతో ఇనయ ట్రాష్ టీమ్ లోనే ఉంటుంది.. నేహా గెలవడంతో క్లాస్ టీంలోకి వెళ్తుంది. అయితే నేహా క్లాస్ లోకి వెళ్లాలి కాబట్టి క్లాస్ టీమ్ లో ఉన్న గీతు, ఆదిరెడ్డి, సూర్య లలో ఒకరు మాస్ లోకి రావాలి. దానికోసం ముగ్గురూ డిస్కస్ చేసుకుంటారు. ఎవరి పాయింట్స్ వారు చెబుతారు. తాను కొత్తగా వచ్చాను అని ఇంకొద్ది సేపు ఉండాలని అనుకుంటున్నాను అంటూ గీతూ చెబుతుంది. ఇక ఆదిరెడ్డి ఫస్ట్ కెప్టెన్ అవ్వాలని ఆ కిక్ వేరే ఉంటుందని.. అందుకే క్లాస్ లోనే ఉండాలని అనుకుంటున్నాను అంటూ తెలిపాడు. దీంతో సూర్య క్లాస్ నుంచి మాస్‌కు వస్తాడు.

ఫైనల్ గా బిగ్ బాస్ టాస్క్ ముగుస్తుంది. చివరకు క్లాస్ టీమ్ లో గీతు, ఆదిరెడ్డి, నేహా ఉండగా.. ట్రాష్ టీమ్ లోకి బాలాదిత్య, ఇనయ, అభినయ ఉంటారు. మిగిలిన సభ్యులు మాస్ టీమ్ లో ఉంటారు. వీరిలో క్లాస్ టీమ్ లో ఉన్నవారు కెప్టెన్సీ పోటీదారులుగా నిలవడమే కాదు నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యారని బిగ్ బాస్ ప్రకటిస్తాడు. ఇక ట్రాష్ టీమ్ సభ్యులు ఇనయ, అభినయ, బాలాదిత్యలు డైరెక్ట్ గా నామినేట్ అయ్యారని చెబుతాడు బిగ్ బాస్.

మరి నామినేషన్ ప్రక్రియ ఇంకా ముగిసినట్టు లేదు. 21 మందిలో ముగ్గురు మాత్రమే నామినేషన్ లోకి వచ్చారు. మూడో రోజు నామినేషన్ పెట్టి మిగిలిన సభ్యులను కూడా నామనినేషన్ లోకి తెస్తారేమో చూడాలి. చూద్దాం ఫైనల్ గా ఎవరు నామినేషన్ లోకి వస్తారో.. ఫస్ట్ వీకే ఎవరు ఇంటి దారి పడతారో..!

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 9 =