ఈవారం ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు?

For Which Movie You are eagerly waiting this week, Brahmastra Captain And Oke Oka Jeevitham Which Telugu Movie Are You Watching This Weekend, Brahmastra Telugu Movie Review,Brahmastram Telugu Movie Review,Oke Oka Jeevitham Telugu Movie Review,Captain Telugu Movie Review,Brahmastra Movie Review,Brahmastram Movie Review,Brahmastram Review,Brahmastra Review,Brahmastram Telugu Review,Brahmastra Telugu Review,Oke Oka Jeevitham Movie Review,Oke Oka Jeevitham Review,Oke Oka Jeevitham Telugu Review,Captain Movie Review,Captain Review,Captain Telugu Review,Brahmastra First Review,Brahmastram Part One: Shiva Movie Review,Brahmastra Part One: Shiva Movie Review,Brahmastram Movie Review And Rating,Brahmastra Movie Review And Rating,BRAHMĀSTRA,Brahmastram Movie Rating,Brahmastra (2022 film),Brahmastra Critics Review,Brahmastra Part One: Shiva,Brahmastram Part One: Shiva, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News,

శుక్రవారం వస్తుందంటే చాలు సినీ లవర్స్ కు పండగే. ఈమధ్య కరోనా వల్ల పరిస్థితులు బాలేక థియేటర్ల వద్ద కళ తప్పింది కానీ.. ఇంతకుముందు శుక్రవారం అంటే సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుండేవారు. ప్రతి శుక్రవారం రెండు మూడు సినిమాలకు పైనే బాక్సాఫీస్ వద్ద సందడి చేసేవి. ఈమధ్య మళ్లీ పూర్వ వైభవం వస్తుంది థియేటర్లకు. అంతేకాకుండా కేవలం ఒక్క శుక్రవారమే కాదు ఎప్పుడు వీలుంటే అప్పుడు సినిమాలు రిలీజ్ చేసేస్తున్నారు. ఇక ఈమధ్య కాలంలో రిలీజ్ అయిన సినిమాలు కూడా కాస్త ప్రేక్షకులను థియేటర్లవైపు మళ్లించాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ శుక్రవారం కూడా మూడు సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. అవి బ్రహ్మాస్త్ర, కెప్టెన్ ఇంకా ఒకే ఒక జీవితం. వీటిలో రెండు సినిమాలు డబ్బింగ్ సినిమాలు కాగా ఒకే ఒక జీవితం మాత్రం స్ట్రైయిట్ తెలుగు మూవీ. ఇందులో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్, అలియా భట్ హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. ఈసినిమా తెలుగులో బ్రహ్మాస్త్రం పేరుతో రిలీజ్ కాబోతుంది. ఇక విజువల్ వండర్ గా రాబోతున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అస్త్రాల నేపథ్యంలో అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈసినిమా చూడటానికి ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఆర్య కథానాయకుడిగా వస్తున్న సినిమా ‘కెప్టెన్’. ఆర్మీ నేపథ్యంలో ఇండియన్ సినిమా హిస్టరీలో ఫస్ట్ క్రియేచర్ ఫిల్మ్ గా ఈసినిమా వస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోవడంతో ఈసినిమా కోసం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ఈసినిమాను థింక్ స్టూడియోస్ అసోసియేషన్‌తో నిర్మాణ సంస్థ ది స్నో పీపుల్ పతాకంపై ఆర్య నిర్మించారు.

మరోవైపు తెలుగుతోపాటు తమిళ్ లో కూడా రిలీజ్ అవుతున్న సినిమా ఒకే ఒక జీవితం. శర్వానంద్ హీరోగా టైమ్ ట్రావెలింగ్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమా ట్రైలర్ ఇప్పటికే సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడంతో ఈ సినిమాపై కూడా చాలా అంచనాలు ఉన్నాయి.

మరి ఈ మూడు సినిమాల్లో మీరు ఏసినిమాకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో మీ ఓటు ద్వారా తెలియచేయండి.

ఈవారం ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు?

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =