ఒకే ఒక జీవితం ట్రైలర్ రిలీజ్

sharwanands oke oka jeevitham trailer out now, oke oka jeevitham trailer out now, Oke Oka Jeevitham Official Trailer, oke oka jeevitham trailer, sharwanands oke oka jeevitham, sharwanands upcoming movie Oke Oka Jeevitham, Oke Oka Jeevitham, Oke Oka Jeevitham Latest News, Oke Oka Jeevitham Movie Latest Update, sharwanand Latest Movie, sharwanand Telugu Movie Oke Oka Jeevitham, Sharwanand and Amala Akkineni's Oke Oka Jeevitham trailer out now, Amala Akkineni, Oke Oka Jeevitham Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News,

శర్వానంద్, రీతువర్మ హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా ఒకే ఒక జీవితం. ఈసినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఒకసారి రూపొందించారు. తెలుగులో ఒకే ఒక జీవితం అనే టైటిల్ తో రిలీజ్ అవుతుండగా.. ఈ చిత్రం తమిళంలో ‘కణం’ పేరుతో విడుదల కానుంది.ఈసినిమా సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇప్ప‌టికే ఈసినిమా నుండి రిలీజ్ చేసిన పోస్టర్లు, పాట‌లు సినిమాపై మంచి అంచ‌నాలు క్రియేట్ చేశాయి. ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ ను బట్టి ఈసినిమా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో సైన్స్ ఫిక్షన్ అంశాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందించారని అర్థమవుతుంది. తల్లీ కొడుకుల మధ్య బాండింగ్ ను ఇందులో ప్రధానంగా చూపించబోతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ట్రైలర్ విషయానికి వస్తే..మ్యూజిక్ కాంపిటీషన్ లో తదుపరి రౌండ్ కు చేరుకున్న యువ సంగీతకారుడిగా శర్వానంద్ ను పరిచయం చేస్తోంది. కానీ అతనికి సపోర్ట్ గా ఉత్సాహాన్ని అందించే వ్యక్తి అతనితో లేరని దానిపై ఫోకస్ చేయలేకపోతున్నాడు. అతనికి తోడుగా ప్రేయసి (రీతూ వర్మ) ఉన్నప్పటికీ.. ఒంటరిగా ఉన్నాననే భావనలో అసమర్థంగా భావిస్తాడు. ఇలాంటి పరిస్థితులలో అతను కొన్ని సంవత్సరాల క్రితం మరణించిన తన తల్లిని కలుసుకునే అవకాశాన్ని పొందుతాడు. ఒక సైంటిస్ట్ (నాజర్) కనుగొన్న టైమ్ మెషీన్ సహాయంతో.. విధిని మార్చడానికి అతనికి రెండవ అవకాశం లభిస్తుంది. అతని గతం చాలా ఉద్వేగభరితమైనదని.. విషాదకరమైనదని తెలుస్తోంది. మరి అది ఎలా ఉంటుందనేది సినిమా చూస్తే తెలుస్తుంది. ఈ కథ పెద్ద కలలు కనే యంగ్ మ్యుజిషియన్ సంబంధించినది. అతని జీవితంలో జరిగిన ఒక వ్యక్తిగత నష్టం అతన్ని కృంగదీస్తుంది. తనికి మద్దతుగా గర్ల్ ఫ్రండ్ రీతూ వర్మ ఉన్నప్పటికీ, అతను ఒంటరి, వెలితిని భావిస్తాడు. టైం మిషన్ ని కనుకొన్న శాస్త్రవేత్త (నాజర్) రూపంలో జీవితం అతనకి మరొక అవకాశాన్ని ఇస్తుంది. గతం చాలా ఉద్వేగభరితమైనది, అదే సమయంలో విషాదకరమైనది. అతను రెండో అవకాశాన్ని ఎలా ఉపయోగించుకున్నాడు అనేది కథలో కీలకాంశం.

ఇది శర్వానంద్ కోసమే ప్రత్యేకంగారూపొందించిన పాత్రని చెప్పవచ్చు. ఈ పాత్రని శర్వానంద్ అద్భుతంగా పోషించారు. శర్వానంద్ తల్లిగా అమల అక్కినేని చక్కని నటన కనబరిచారు. రీతూ వర్మ కూల్ గా కనిపించగా, వెన్నెల కిషోర్, ప్రియదర్శి మరో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. చూద్దాం మరి ఈసినిమా శర్వాకు ఎలాంటి విజయం అందిస్తుందో..

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =