రంగ రంగ వైభవంగా మూవీ రివ్యూ

Ranga Ranga Vaibhavanga Movie Review,Ranga Ranga Vaibhavanga Telugu Movie Review,Ranga Ranga Vaibhavanga Movie Review,Ranga Ranga Vaibhavanga Review,Ranga Ranga Vaibhavanga Telugu Review,Ranga Ranga Vaibhavanga Movie Review And Rating,Ranga Ranga Vaibhavanga Movie Rating,Ranga Ranga Vaibhavanga Critics Review,Ranga Ranga Vaibhavanga Movie: Review,Ranga Ranga Vaibhavanga Movie Review Out,Ranga Ranga Vaibhavanga Story review,Ranga Ranga Vaibhavanga First Movie Review Out,Ranga Ranga Vaibhavanga Movie Review 2022,Ranga Ranga Vaibhavanga Review 2022,Ranga Ranga Vaibhavanga Movie Highlights,Ranga Ranga Vaibhavanga Movie Plus Points,Ranga Ranga Vaibhavanga Movie Review Telugu,Ranga Ranga Vaibhavanga Movie Public Talk,Ranga Ranga Vaibhavanga Movie Public Response,Ranga Ranga Vaibhavanga 2022,Ranga Ranga Vaibhavanga,Ranga Ranga Vaibhavanga Movie,Ranga Ranga Vaibhavanga Telugu Movie,Ranga Ranga Vaibhavanga Movie Updates,Ranga Ranga Vaibhavanga Telugu Movie Updates

మెగా ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు వైష్ణవ్ తేజ్. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్నాడు. ఇక ఇప్పుడు రంగ రంగ వైభవంగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. గిరీశయ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్-కేతీక శర్మ హీరో హీరోయిన్లుగా ఈసినిమా తెరకెక్కింది. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలా ఉంది… వైష్ణవ్ మరో హిట్ ను అందించిందా లేదా అన్నది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు.. వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ, నవీన్ చంద్ర, సుబ్బరాజు, అలీ, ప్రభు, నరేష్, సత్య, రాజ్‌కుమార్ కసిరెడ్డి, హర్షిణి
దర్శకత్వం.. గిరీశయ
బ్యానర్స్..శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకం
నిర్మాత ..బివిఎస్ఎన్ ప్రసాద్
సంగీతం దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రాఫర్.. శ్యాందత్ సైనుద్దీన్.

కథ..

రిషి (వైష్ణవ్ తేజ్), రాధ (కేతికా శర్మ) ఫ్యామిలీ ఫ్రెండ్స్. రిషి మరియు రాధ కూడా ఎంతో స్నేహంగా ఉండేవారు. అయితే ఒక చిన్న సంఘటన ఈ స్నేహితులను శత్రువులుగా మారుస్తుంది. అలా పెద్దయ్యాక కూడా ఇగో కారణంగా ఇద్దరూ మాట్లాడుకోరు. రిషి తండ్రి (నరేష్), రాధ తండ్రి (ప్రభు) కుటుంబాల మధ్య విడదీయలేనంత స్నేహం ఉంటుంది. రాధ అన్న అర్జున్ (నవీన్ చంద్ర) ఐఐటీలో చదివి రాజకీయాల్లో రాణించేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఇలా రెండు కుటుంబాలు అన్యోన్యతతో ఉంటుండగా.. ఓ పెళ్లి అంశం కారణంగా రెండు కుటుంబాలు విడిపోవాల్సి వస్తుంది. మరోవైపు ఎంత అహంకారంతో ఉన్నా కూడా రిషి, రాధ ఒకరినొకరు ఇష్టపడతూనే ఉండేవారు. అయితే బయటకు మాత్రం చెప్పుకునేవారు కాదు. రిషికి, రాధాకు చిన్నతనంలో ఎందుకు గొడవలు వచ్చాయి? రిషికి, రాధాకు మధ్య ఉన్న గొడవ కారణంగా ఎలాంటి సమస్యలు వచ్చాయి? పెళ్లి కారణంగా విడిపోయిన కుటుంబాలను కలిపే ప్రయత్నంలో రిషి, రాధాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి..? చివరికి రిషి, రాధల ప్రేమ ఎమైంది అనేది మిగిలిన కథ..

విశ్లేషణ..

రంగ రంగ వైభవంగా సినిమా కథను చూస్తే మనకు చాలా కథలు గుర్తుకు వస్తాయి. హీరో హీరోయిన్లు చిన్నప్పటి నుండి ఎప్పుడూ ఏదో ఒక కారణంతో గొడవపడి, ఆ తర్వాత ప్రేమలో పడి ఒకరి పట్ల ఒకరికి ఉన్న అభిప్రాయాన్ని మార్చుకోవడం ఇలాంటి పాయింట్‌పై ఎన్నో సినిమాలు వచ్చాయి. రంగ రంగ వైభవంగా సినిమా కూడా అలాంటి పాయింట్ వచ్చినదే. అయితే ద‌ర్శ‌కుడు అదే పాయింట్ ను ఎంత కొత్తగా చూపించాడు అన్నది ముఖ్యం. ఈసినిమాకు దర్శకత్వం వహించిన గిరీశయ కాస్త కొత్త‌గానే ఆలోచించాడు. హీరోయిన్‌కి ఓ అన్న‌య్య పాత్ర‌ను క్రియేట్ చేసి.. త‌న‌కు ఓ పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్‌ను క్రియేట్ చేశాడు. దాని వ‌ల్ల వ‌చ్చే ఇబ్బందుల‌తో సినిమాను ముందుకు తీసుకెళ్లాడు.

ఇక నటీనటుల విషయానికొస్తే.. ముందు రెండు సినిమాల్లో వైష్ణవ్ తేజ్ చేసిన పాత్రలకు ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ పాత్రకు చాలా తేడా ఉంటుంది. త‌న గ‌త రెండు చిత్రాల‌కు భిన్న‌మైన పాత్ర‌ను ఇందులో చేశాడు. రిషి పాత్ర‌లో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు. కేతికా శర్మ కూడా తన గ్లామర్ తో యూత్ ను ఆకట్టుకుంటుంది. నవీన్ చంద్ర తనకు ఇచ్చిన పాత్రలో డీసెంట్ గా నటించాడు. కోపంతో, త‌న‌కు అవ‌మానం జ‌రిగింద‌ని ఫీల‌య్యే యువ‌కుడి పాత్ర‌లో త‌ను ఒదిగిపోయాడు. సీనియర్ నటులు నరేష్, ప్రభు తమ పాత్రలను చక్కగా చేశారు. సత్య మరియు రాజ్‌కుమార్ నవ్వులు పూయించారు. ఇతర నటీనటులు తమ పాత్రల మేర నటించారు.

సాంకేతిక విభాగానికి వస్తే దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం బాగానే ఆకట్టుకుంటుంది. తెలుసా, తెలుసా.. కొత్తగా లేదేంటీ పాటలు ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతం కూడా బాగుంది. శ్యాందత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ పర్వాలేదు మరియు కొన్ని సన్నివేశాలు కలర్‌ఫుల్‌గా కనిపిస్తాయి. ఈ సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఇక ఓవరాల్ గా చెప్పాలంటే ఈ సినిమాలో ఫ్రెండ్‌షిప్, లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్, ఫైట్స్, సాంగ్స్ ఇలా అన్నీ ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే అంశాలు ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు అన్ని వర్గాల వారు ఈసినిమాను ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 12 =