బీవీ హో తో ఐసా (1988 ) మూవీ లో సపోర్టింగ్ రోల్ తో బాలీవుడ్ కు పరిచయం అయిన సల్మాన్ ఖాన్, బ్లాక్ బస్టర్ మైనే ప్యార్ కియా మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి హీరోగా సెటిల్ అయ్యారు. ఆ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ తో సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. హమ్ ఆప్ కె హై కౌన్, కరణ్ అర్జున్, కుచ్ కుచ్ హోతా హై , హమ్ దిల్ దే చుకే సనమ్ , హలో బ్రదర్ , తేరే నామ్ , పార్ట్ నర్ , వాంటెడ్ , దబాంగ్ , రెడీ , ఏక్ థా టైగర్ , జై హో, కిక్ , భజరంగి భాయిజాన్ , సుల్తాన్ , టైగర్ జిందా హై , భరత్ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన టైగర్ 3 మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ మూవీ లో సల్మాన్ అతిథి పాత్రలో నటించారు. సల్మాన్ ప్రస్తుతం కభీ ఈద్ కభీ దివాలీ మూవీ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కోటను కోట్ల కలెక్షన్స్ రాబడుతున్న మూవీస్ తో బాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న సల్మాన్ ఖాన్ తన 34 సంవత్సరాల సినీ జర్నీ ని కంప్లీట్ చేసుకున్నారు ఈ సందర్భంగా సల్మాన్ తన కొత్త సినిమా టైటిల్ కిసీ కా భాయ్ కిసీ కా జాన్ గ అనౌన్స్ చేస్తూ ఆ మూవీ లో తన లుక్ ను రివీల్ చేశారు. 3 దశాబ్దాలుగా సల్మాన్ ఖాన్ ప్రొడ్యూసర్ , యాక్టర్ , టీవీ ప్రెజెంటర్ గా ప్రేక్షకులను అలరిస్తూ క్రేజీ హీరోగా కొనసాగుతున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: