తెలుగు , తమిళ ,మలయాళ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో కీర్తి సురేష్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు.“భోళా శంకర్ “మూవీ లో మెగా స్టార్ చిరంజీవి కి సోదరి గా కీర్తి నటిస్తున్న విషయం తెలిసిందే. దసరా(తెలుగు ), , మామన్నన్ (తమిళ ), వాషి (మలయాళ) మూవీస్ లో కీర్తి నటిస్తున్నారు. తాజాగా కీర్తి ప్రధాన పాత్రలో హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై సుధా కొంగర దర్శకత్వంలో ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ తెరకెక్కనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రెగ్యులర్ హీరోయిన్ గా కమర్షియల్ ఎంటర్ టైనర్స్ మూవీస్ తో పాటు కీర్తి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ లో కూడా అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. సాని కాయిధమ్ తమిళ మూవీ లో డీ గ్లామర్ రోల్ లో నటించిన కీర్తి మరో తమిళ మూవీ లో పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. దసరా మూవీ లో కీర్తి డీ గ్లామర్ లుక్ లో కనిపించనున్నారు. ఏ జానర్ , ఏ వెరైటీ రోల్ లో నైనా నటించడానికి కీర్తి పెట్టింది పేరుగా మారారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























